• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Vidya Mantra Yantra Tantra Rahasyalu

Sri Vidya Mantra Yantra Tantra Rahasyalu By Dr Krovi Parthasarathy

₹ 390

శ్రీవిద్య

  1. శ్రీవిద్య అంటే ఏమిటి ?

సకుంకుమవిలేపనా మళిక చుంబి కస్తూరికాం
సమందహసితేక్షణాం సశర చాపపాశాంకుశాం
అశేషజనమోహినీం అరుణమాల్య భూషాంబరాం
జపాకుసుమభాసురాం జపనిధౌ స్మరేదంబికాం ॥

నుదుటన కస్తూరి తిలకము ధరించినది, చిరునగవు చిందించునది, పాశము, అంకుశము, ధనుర్బాణములు చేతులయందు ధరించినది, లోకాలన్నింటినీ మోహింపచేయునది, ఎర్రనివస్త్రములు ధరించినది, మంకెన్నపువ్వువలె పాటలవర్ణము గలది అయిన పరమేశ్వరిని ధ్యానించుచున్నాను.

నిరాకారుడు నిర్గుణస్వరూపుడు పరబ్రహ్మ. అతని ప్రతిరూపమే పరమేశ్వరి. సృష్టి ప్రారంభంకాకముందు పరమేశ్వరుడు బిందురూపంలో ఉండేవాడు. తనలో లీనమై ఉన్న జీవులయొక్క కర్మను క్షయంచేసి వారికి మోక్షం కలిగించాలనే కోరికతో 'సృష్టిచెయ్యాలి' అని సంకల్పించాడు. అప్పుడు తన నుండి కొంతభాగాన్ని బయటకు పంపాడు. అదే శక్తి, త్రికోణరూపిణి. ఇప్పుడు

త్రికోణరూపిణీ, శక్తిః, బిందురూపపర శ్శివః త్రికోణమే శక్తి. కాగా బిందువు శివుడు. వీరిద్దరూ వేరువేరుగా ఉండరు. కలిసే ఉంటారు. శివుడు లేకుండా శక్తిగాని, శక్తి లేకుండా శివుడుగాని ఉండరు. త్రికోణే బైందవంక్లిష్టం. త్రికోణంలో బిందువుంటుంది. ఈ త్రికోణం నుంచే నామరూపాత్మకమైన జగత్తు ఏర్పడింది.

'త్రికోణం' అంటే యోని, అదే జన్మస్థానం. స్థావర జంగమాత్మకమైన జగత్తు అంతా ఈ త్రికోణం నుంచే వచ్చింది. ఆ త్రికోణమే పరమేశ్వరి రూపం........................

  • Title :Sri Vidya Mantra Yantra Tantra Rahasyalu
  • Author :Dr Krovi Parthasarathy
  • Publisher :Gollapudi Veeraswamy Son
  • ISBN :MANIMN4615
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :385
  • Language :Telugu
  • Availability :instock