• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Vidya Paadukanta Purna Deeksha

Sri Vidya Paadukanta Purna Deeksha By Swamy Paramananda

₹ 100

 శ్రీవిద్య

'శ్రీవిద్య' అంటే బ్రహ్మవిద్య. "ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా కామసేవితా” అంటోంది లలితా సహస్రం. శ్రీవిద్య అనేది మహావిద్య. అంతకు మించినది ఇంకేదీ లేదు. ఇది ఆత్మవిద్య. ఆత్మ అంటే - పరమేశ్వరుడు, పరబ్రహ్మ అని అర్థం. ఆ పరబ్రహ్మని గురించి చెప్పేదే శ్రీవిద్య. అదే బ్రహ్మవిద్య. చరాచర జగత్తంతా కంటికి కనిపించని దివ్యమైన శక్తితో నడపబడుతున్నది. ఆ చైతన్యశక్తి యొక్క శాస్త్రీయ నామమే బ్రహ్మము. ఆది మధ్యాంత రహితమైనది. సృష్టి స్థితి లయాలకు కారణమైనది బ్రహ్మము. జగత్తులో దేన్ని గురించి తెలుసుకుంటే, అన్ని విషయాలు తెలుస్తాయో అదే బ్రహ్మము. ఈ జగత్తులో సర్వము బ్రహ్మమయము, ప్రాణమున్నవి ప్రాణం లేనివి, చలనమున్నవి చలనం లేనివి అన్నీ బ్రహ్మమే.

ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినట్లుగా దశదిశలు బ్రహ్మము. నదీనదాలు, అడవులు, కొండలు, ఎడారులు, రాజులు, రాజ్యాలు అన్నీ బ్రహ్మమే. భూలోకంలోనే కాదు ఆకాశంలో ఉండే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మెరుపుతీగలు అన్నీ బ్రహ్మమే. అంతేకాదు ఈ శరీరంలో ఉన్న ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ శ్రోత్రం బ్రహ్మ. అంటే చరాచర జగత్తులో బ్రహ్మము కానిది ఏదీలేదు. సర్వంబ్రహ్మమయం.

ఆ బ్రహ్మమే సాకారము, నిరాకారము అని రెండు రకాలుగా ఉన్నది. ఇందులో సాకారబ్రహ్మ ఒక ఆకారం కలిగి ఉంటుంది. ఇతర జీవులకు మల్లేనే, దానిక్కుడా కాళ్ళు, చేతులు మిగిలిన శరీర భాగాలు ఉంటాయి. ఒక్కోసారి ఇది మానవాకారంలో ఉంటుంది. దీన్నే అపరబ్రహ్మ అనికుడా అంటారు. ఈ అపరబ్రహ్మ పరమపదంలో ఉంటుంది.

మనం చేసే పూజలు, జపాలు, తపాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నీ సాకారబ్రహ్మోపాసనే. సాకారాన్ని ఉపాసించిన వారు మరణానంతరము పరమపదం చేరతారు. అక్కడికి చేరినవారికి మరుజన్మ ఉండదు. అదే ముక్తి.

స్త్రీ రూపంలో ఉండే సాకార బ్రహ్మనే మహాత్రిపురసుందరి అంటారు. ఈవిడ ఉండే ప్రదేశాన్నే (పరమపదము) మణిద్వీపము అంటారు. అది ఎక్కడ ఉన్నది?.............................

  • Title :Sri Vidya Paadukanta Purna Deeksha
  • Author :Swamy Paramananda
  • Publisher :Smathrugami Publications
  • ISBN :MANIMN5815
  • Binding :Paerback
  • Published Date :2024
  • Number Of Pages :120
  • Language :Telugu
  • Availability :instock