ఉగ్రం వీరం మహా విష్ణుం
జ్వలంతం సర్వతోముఖం
నృశింహం సర్వతో భద్రం
మృత్యో మ్ముత్యుం నమామ్యహం.
శ్రీ అంటే ఆత్మ, శ్రీ అంటే పరమాత్మ. శ్రీ అంటే పరాశూన్యం, పరాపరిపూర్ణం, మాయా మేయ జగత్తు కూడా అందులో ఉన్న చరాచరములు అన్నీ కూడా శ్రీ యే . ఈ శ్రీ విద్య శరీర విద్య కాదు, అవును. రెండూకూడా మన అనాది ఏది? మన ఆది ఏది? ఎందులో నించి వచ్చింది? మళ్ళీ ఎందులో కలుస్తుంది? ఇక్కడ మనము ఉన్న స్థితి పేరు ఏమిటి? వీటన్నింటి యొక్క సమాహార లక్షణము శ్రీ అన్న దాంట్లో ఇమిడి ఉన్నది. అది శ్రీ యొక్క పరారహస్యం. అవ్యక్త, వ్యక్తి రెండు శ్రీ యే శూన్య, పూర్ణ రెండూ శ్రీ యే. పుట్టక, జీవితం మత్యువు అన్నీ శ్రీ యొక్క గర్భంలోనించే.
శ కారము పుట్టుక,ర కారము మనుగడ ఈ కారము మృత్యువు, ఈ మూడింటికి కారణము, కార్యము అయిన దానిని శ్రీ అంటారు. ఈ కారణాన్ని, కార్యాన్ని తెలుసుకొనే విద్యకు శ్రీవిద్య అని పేరు. అంటే బ్రతుకును మనుగడగా సార్థకం చేసుకునే విద్య, పోయిన పిమ్మట సార్థకమయే విద్య. అనాది, ఆది, మధ్య, అంతముల యందు వదలకుండా ఉండేది ఏదో మనని అది శ్రీ. దాని పేరే ఆత్మ. అది ఎక్కడ నుండీ వచ్చింది అది పరమాత్మ. అంటే పరమాత్మ పూర్ణము అన్న దాంట్లోంచి అంశ భాగమైన ఆత్మ వచ్చింది. ఉదా॥ కుండెడు పాలు పూర్ణము. అందుంది చెంబులోకి పోసిన పాలు అంశము. అయినా ఇందులోను, అందులోను ఉన్నవి పాలే కదా చెంబును, కుండను వేరువేరుగా చూడటం మాయ కదా. అందు, ఇందు ఉన్న పాలను ఒక్కటే అనుట శ్రీ లేక బ్రహ్మము. అంటే శ్రీ బ్రహ్మము, శ్రీ పరమాత్మ శ్రీ పూర్ణము, శ్రీ అంశము కూడా అయింది. ఇదంతా అనంతత్వము. అనాద్యనంత తత్వం, దీనిని ఎరిగినవారు తత్త్వవేత్త. దీనిని జ్ఞానంలో బ్రహ్మం అన్నారు. ఇది ఎరిగిన వారిని బ్రహ్మవేత్త, బ్రహ్మవాది అన్నారు. అంటే శ్రీవిద్యను ఆశ్రయించిన జీవాత్మ బ్రహ్మవేత్త అవుతుంది. మానవుని ఆత్మ చైతన్యముతో కూడి అహం (నేను) అంటుంది మొదట ఈ అహాన్ని చైతన్యము కంటే పైకి వెళ్ళి చూస్తే అది ఆత్మ అని తెలుసుకుంటుంది. ఇంకా కొంచెము పైకి వెళితే అది పరమాత్మ యే కాని మరి ఏమీ కాదు. అంశ, పూర్ణ భావన చేత, ఆ భావనని తీసివేస్తే పూర్ణమదః...................