• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Srimadandhra Mahabharathamu

Srimadandhra Mahabharathamu By Dr Addanki Srinivas

₹ 504

శ్రీమదాంధ్రమహాభారతము

కవిత్రయం గురించి నాలుగు మాటలు

శ్రీవాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహంత్య విహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్రేయసే

(రొమ్ములో, ముఖంలో, దేహంలో వరుసగా లక్ష్మీ, సరస్వతి, పార్వతులను ధరిస్తున్నారు విష్ణు, బ్రహ్మ, శంకరులు. స్త్రీ, పురుష కలయిక వల్ల పుట్టిన లోకాలను కాపాడుతూ నడిపిస్తున్నారు. దేవతలచే పూజింపబడుతున్నారు. అట్టి విష్ణు, బ్రహ్మ, శంకరులు మీకు శుభాలను  కలిగించెదరు గాక !)

ఇది శ్రీ మదాంధ్ర మహాభారతంలో మొట్టమొదటి శ్లోకం. తెలుగు కవిత్వానికి శ్రీకారం చుట్టి ఆదికవి, వాగనుశాసనుడు అనే బిరుదుల్ని పొందిన నన్నయ భట్టారకుడి కలం నుండి జాలువారిన రచన. అది సంస్కృతంలో ఉంది.

ఇది ఆనాటి తెలుగు భాషాసాహిత్యాలపై ఉన్న సంస్కృత భాషా ప్రభావాన్ని తెలియ జేస్తుంది. 'రాజకులైక భూషణుడు రాజమనోహరుడు అన్యరాజతేజో జయశాలి శౌర్యుడు' (ఆం.భా. అవతారిక) అంటూ సాగిన ఈ పద్యమే నన్నయ రాసిన మొట్టమొదటి తెలుగు పద్యం.

ఈ పద్యంతో ప్రారంభించి నన్నయ కవితా ప్రస్థానం కావించాడు. సోదరభాషలతో ఏ భాషకూ లేనంత సాహితీభాండాగారం, విశిష్ట పదసంపద, వైవిధ్యం, వైలక్షణ్యం, వైదగ్ధ్యం కలది తెలుగుభాష. ఇలా తెలుగు వెలుగై వెలగడానికి, వెల్లివిరియడానికి తెరకట్టి నాందీ ప్రస్థావన చేసినవాడు ఆదికవి నన్నయే..............

  • Title :Srimadandhra Mahabharathamu
  • Author :Dr Addanki Srinivas
  • Publisher :Sri Raghvendra Publications
  • ISBN :MANIMN5067
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :576
  • Language :Telugu
  • Availability :instock