• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Srimathi Galla Arunkumari

Srimathi Galla Arunkumari By Srimathi Galla Arunkumari

₹ 1000

తండ్రీ కూతుళ్ల కథ

- నామిని

గల్లా అరుణకుమారి. ఈమె కన్నతండ్రి రాజగోపాల నాయుడు అనీ, భర్త రామచంద్ర నాయుడు అనీ, ఈమె పిల్లవాడు గల్లా జయదేవ్ అనీ, ఈమె కూతురు డాక్టర్ రమాదేవి అనీ.... వీళ్ల కంపెనీ అమర రాజా బ్యాటరీస్ అనీ... ఏ ఒక్క పేరు గురించీ ఒక్క వివరం అక్కర్లేదు. మా తిరుపతిలోనే కాదు భారత దేశంలోనే ఈ అమరరాజా సామ్రాజ్యంలో అరుణకుమారి ఒక మహరాణి. ఆమెనీ, ఆమె రాసిన యీ పుస్తకాన్నీ నామిని సుబ్రమణ్యం నాయుడు అనే వాడు పరిచయం చేస్తూ నాలుగు మాటల్ని ముందుమాటగా రాయడం ఎంత విచిత్రం! యీ పుస్తకాన్ని చేతికి తీసుకున్న ఎవరికైనా నేనెవర్నో, అడ్డం తగులుతూ ఈ 2, 3 పేజీలు యెందుకు రాశానో తెలవాల కదా!

నేనొక రచయితను. తెలుగువాళ్లకి ఒక 300 మందికి నా పేరు తెలిసి వుంటుంది. అందులో ఒక ఇరవై మందికి నేను రాసిన పుస్తకాలు తెలిసుంటాయి. ఒక అయిదారు మంది పుస్తకాలు చదివి కూడా వుంటారని పందెం కాస్తాను కావాలంటే. ఇంతకు మించి ఏం లేదు. ఈ పుస్తకానికి నేను ముందుమాట రాసినంత మాత్రాన నేనీ కుటుంబానికి సన్నిహితమూ కాదు, పుస్తకం రాసినామెకి నేనంటే రచయితగా అపారమైన గౌరవమూ లేదు. ఇది అరుణ కుమారి మంచితనం. పాపం పుస్తకాన్ని 3, 4 సార్లు చదివి వేలాది అచ్చు తప్పుల్ని పట్టి అగచాట్లు పడ్డాడు, పైగా సాకం నాగరాజ యితన్నేదో రచయిత అని అంటున్నాడు, ఆ ముందు మాటేదో ప్రూపులు చూసిన యితన్నే రాయమందాం అని దయ తలవడం వల్ల మాత్రమే యీ వుద్యోగం నాకు లభించింది.

యెందుకింతగా తగ్గి తగ్గి చెప్తున్నానంటే - యిలాంటి కుటుంబాలు నాలాంటి వారికి పరిచయం కావడం ఒక రకమైన తలకాయ నెప్పి. తిరుపతిలో సాకం నాగరాజ అని వొక రిటైర్డు తెలుగు లెక్చరర్ వున్నాడు. తిరుపతిలో ఏ సభ జరగాలన్నా పది మందిని వుడ్డ చేర్చగల కార్యకర్త. ఈయన అరుణ కుమారి దృష్టిలో పడ్డాడు. ఒకసారి రాజన్న జయంతి..............

  • Title :Srimathi Galla Arunkumari
  • Author :Srimathi Galla Arunkumari
  • Publisher :Emesco Books pvt.L.td.
  • ISBN :MANIMN5664
  • Binding :Hard Binding
  • Published Date :May, 2024
  • Number Of Pages :935
  • Language :Telugu
  • Availability :instock