• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Srowtayagna Parichayam

Srowtayagna Parichayam By N T G Antarvedi Krishanamacharyulu

₹ 90

ప్రథమ ఖండం

శ్రాతయజ్ఞ పరిచయం

ప్రవేశిక: భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు మూలమైంది వేదం. జ్ఞానవిజ్ఞాన రాశి అయిన వేదానికి "శృతి" అని మరో నామం. అలా ఆ శృతిలో ప్రధానంగా ప్రతిపాదించబడిన విషయం యజ్ఞం. శృతిప్రోక్తమైన యజ్ఞాలే, శ్రాతయజ్ఞాలుగా వ్యవహరించబడుతున్నాయి. అలాంటి శ్రాతయజ్ఞాల పరిచయం చేసుకోబోయే ముందుగా యజ్ఞశబ్దార్ధాన్ని యజ్ఞవైభవాన్ని, యజ్ఞబేధాది విషయజ్ఞానాన్ని పొందడం ఎంతైనా ఆవశ్యకం.

యజ్ఞశబ్దార్ధం: యజ్ థాతువునకు “యజ్ఞయా చయతి విచ్ఛ ప్రచ్ఛర రక్షో నఇన్" అనే పాణినీయ సూత్రం ప్రకారం నఞ ప్రత్యయం చేయటంవల్ల యజ్ఞశబ్దం నిష్పన్నమౌతున్నది. ఈ యజధాతువుకి 'యజదేవ పూజా సంగతి కరణ దానేషు’ అని అనటాన్నిబట్టి దేవపూజ, సంగతికరణం, దానాలయందు ఉపయోగించ వచ్చని తెలుస్తున్నది. ఈ మూడుకార్యాలు యజ్ఞంలో ఆచరించబడతాయి. అంటే-

దేవపూజ: దేవతలను సత్కరించటం లేదా యథాయోగ్యంగా వ్యవహరించటం దేవపూజ అనబడుతుంది. యజ్ఞంలో దేవతలు అర్చించబడతారు కాబట్టి దాన్ని యజ్ఞం అనాలని తెలుస్తున్నది. అందుకే యజ్ఞ నిర్వచనాన్ని తెలియచేసే వాక్యాలు ఇలా ఉన్నాయి -ఇజ్యన్తో (పూజ్యన్తో) దేవా అనే నేతి యజ్ఞః, ఇజ్యతే దేవేభ్యః అస్మిన్ ఇతి యజ్ఞః ; ఇజ్యతే అసౌ ఇతియజ్ఞః; యజనం ఇంద్రాది దేవానాం పూజనం సత్కారభావనం యజ్ఞః, ఇజ్యన్తో సంపూజితాః తృప్తి మాసాద్యన్తో దేవా అత్రేతి.

సంగతికరణం: దేవతా తుల్యమైన మహర్యాదులను ఒకచోట చేర్చటం సంగతి కరణం అనబడుతుంది. యజ్ఞం చేసే సమయంలో విద్వాంసులు, మహాపురుషులు, సాధుసంతులు, వైదిక మూర్ధన్యులు ధర్మ, దేశ, జాతి మర్యాద రక్షణకై ఎకత్రిత మౌతారు. కాబట్టే అది యజ్ఞం అనబడుతుంది. 'యజనం ధర్మ-దేశ జాతి- మర్యాదారక్షాయై మహాపురుషాణామేకీ కరణం యజ్ఞః,' 'ఇజ్యన్తో సంగతీక్రియనే....

  • Title :Srowtayagna Parichayam
  • Author :N T G Antarvedi Krishanamacharyulu
  • Publisher :Sahiti Prachuranalu
  • ISBN :MANIMN4694
  • Binding :Papar back
  • Published Date :Aug, 2023
  • Number Of Pages :112
  • Language :Telugu
  • Availability :instock