శృంగారపురం ఒక కిలో మీటరు
వర్షకి మెలకువ వచ్చింది.
పడక మీదనుంచి లేచి కూర్చుని చుట్టూ చూసింది. చీకటి గోడకి దిగ్గొట్టిన మేకులా యెర్రటి బెడ్లైట్ వెలుగుతోంది.
రెండు చేతుల్నీ బాగా రాపాడించి కళ్ళను తుడుచుకుంది. ఆ కాస్త వేడిమికే నిద్ర కరిగిపోయినట్లు ఫ్రెష్ ఫీలయింది.
పక్కకు తిరిగి చూస్తే టైమ్పీస్ అయిదు గంటలను చూపిస్తోంది. కిటికీలోంచి కనిపిస్తున్న బోగన్ విల్లా, పచ్చల రాయికి పగడాలను పొదిగినట్లుంది. దూరంగా వున్న తురాయి చెట్టు పండక్కి పుట్టింటికి వచ్చిన పదిమంది ఆడపిల్లల కుటుంబంలా ఆకులన్నీ రాల్చేసి పూలనే మిగల్చుకుని కనిపిస్తోంది. గాలి అప్పుడే నదీస్నానం చేసివచ్చినట్లు చల్లగా తగులుతోంది.
"అబ్బ! ఎంత బావుందో వాతావరణం" తనలో తనే అనుకుంటూ పడకమీద నుంచి కిందకి దిగింది వర్ష..................