• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Steve Jobs
₹ 895

 ఒక సృజనాత్మక వ్యాపారవేత్త విశిష్ట వ్యక్తిత్వం, రంగుల రాట్నం వంటి అతని జీవిత చిత్రం ఈ పుస్తకంలో ప్రతిబింబిస్తుంది. పరిపూర్ణత కోసం అతని తపన, ప్రచండమైన ఉత్సుకత ఆరు పరిశ్రమలలో విప్లవాన్ని సృష్టించాయి. అవి: పర్సనల్ కంప్యూటర్లు, ఏనిమేషన్ సినిమాలు, సంగీతం, ఫోన్ లు, టాబ్లెట్ కంప్యూటర్లు మరియు డిజిటల్ ప్రచురణ. అది పరిశ్రమ కాదుగాని, చిల్లర దుకాణ వ్యవస్థను ఏడవ రకంగా మనం కలుపుకోవచ్చు. ఈ రంగంలో అతను విప్లవం సృష్టించకపోయినా, రిటైల్ స్టోర్స్ స్వరూప స్వభావాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు. వీటికి తోడుగా డిజిటల్ సమాచారంలో కేవలం వెబ్ సైట్లతో సరిపెట్టకుండా అప్లికేషన్(ఏప్స్)తో సరికొత్త మార్కెట్ ను ఆవిష్కరించాడు. మానవ జీవన శైలిని ప్రభావితం చేసే వినూత్న ఉత్పాదనలు తయారు చెయ్యడమే కాకుండా, తనదైన ముద్రగల కంపెనీని పెంచి పోషించాడు. సృజనాత్మకత ఉట్టిపడే ఇంజనీర్లు సాహసమే ఊపిరిగా చేసుకున్న ఇంజినీర్లు అతని దార్శనికతను ముందుకు తీసుకెళ్ళగలరడనంలో సందేహం లేదు. ఆగస్ట్ 2011లో, అతను ఏపిల్ సీఈఓగా తప్పుకునే ముందు, తన తండ్రి కారు గేరేజిలో ప్రారంభించబడిన ఈ సంస్థ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా కీర్తించబడడం ఒక అద్భుతం.

                అలాగే ఈ పుస్తకం కూడా నూతన ఆవిష్కరణలకు ప్రతిరూపంగా నిలబడగలదని ఆశిస్తున్నాను. అమెరికా ఆర్ధిక ఒడిదుడుకుల్ని అధిగమించడానికి నూతన ఆవిష్కరణలకోసం ఆరాటపడుతున్న సమయంలో, సృజనాత్మక డిజిటల్ శకం ఆర్ధిక వ్యవస్థను నిర్మించడానికి ప్రపంచ దేశాలన్నీ దృష్టి సారిస్తున్న తరుణంలో జాబ్స్ తన పరిశోధనాత్మక తపనతో, ఊహాతీత శక్తితో, మానవ జాతి గతికి, ప్రగతికి అంతిమ చిరునామాగా నిలబడ్డాడు. ఇరవై ఒకటవ శతాబ్దంలో విలువను సృష్టించడానికి సృజనాత్మకతను సాంకేతికత్వంతో ముడిపెట్టడమే అత్యుత్తమ మార్గమని అతను గ్రహించాడు. అందుకే అతని కంపెనీలో  అద్బుతమైన ఇంజనీరింగ్ విన్యాసాలు సాధించగలిగాడు. వినియోగదారులు తమకు ఏమి కావాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు సరికొత్త సాధనాలను, సేవలను సమకూర్చి, మానవ జీవన శైలిని మలుపు తిప్పగలిగిన మహా మనీషి స్టీవ్ జాబ్స్.

               అతని వ్యక్తిత్వం, అతని తపన, అతని ఉత్పాదనలు - ఇవన్నీ ఏపిల్ లోని హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ మాదిరిగా, ఒక సమీకృత వ్యవస్థలా ఒకదానికొకటి అనుసంధానించబడి ఉంటాయి. అతని జీవిత గాధ సందేశాత్మకంగానే కాకుండా, హెచ్చరించేలా కూడా ఉంటుంది. మిరిమిట్లు గొలిపే స్వర్గ శిఖరం అంచులను అందుకున్న అతని వినూత్న ఆవిష్కరణల గాధ, రెండు జంటల తల్లిదండ్రులతో మొదలై, అమెరికాలోని ఒక లోయలో పెరిగి పెద్దవాడై అక్కడ దొరికే సిలికాన్ పొడిని బంగారు పొడిగా మార్చే ప్రక్రియను ఒంటబట్టించుకున్నాడు.

- వాల్టర్ ఇసాక్సన్ 

 

  • Title :Steve Jobs
  • Author :Walter Isaacson , Godavarthi Satyamurthy
  • Publisher :Reem Publications Pvt Ltd
  • ISBN :MANJUL0213
  • Binding :Hard binding
  • Published Date :2014
  • Number Of Pages :620
  • Language :Telugu
  • Availability :instock