మన హైందవ సంస్కృతిలో ఉన్న షణ్మతాలలో గాణాపత్యమతం ఒకటి. ఈ గాణాపత్యం గణపతే సర్వదేవులలో ప్రథముడని చెప్తుంది.
అలా గాణాపత్యం మహోన్నత స్థితిలో ఉన్న సమయంలో అనేక రూపాలు, దేవాలయాలు ఏర్పడ్డాయి. గణపతి రూపాలను, గణపతి దేవాలయంలో ఉండే దేవతలనూ ఈ వ్యాసం రేఖామాత్రంగా స్పృశిస్తుంది.
గణపతిరూపాలు
గణపతి రూపాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిలో ముద్గలపురాణం పేర్కొన్న 32రూపాలు విశిష్టమైనవి. అందులోనూ పదహారు గణపతులు విశేషమైనవని శైవాగమం చెస్తోంది. శిల్పావతంస అనే శిల్పగ్రంథం 54రూపాలను తెలిపింది. ఇంకా శైవాగమధ్యానగ్రంథాలు మరిన్ని గణపతి రూపధ్యానాలను తెలుపుతున్నాయి.
గణపతిని ఎక్కడ ప్రతిష్ఠించాలి?
గణపతి అనేక ఆలయాలలో కోష్టదేవతగా, పరివార దేవతగా, ప్రధాన దేవతగా దర్శనం ఇస్తాడు. శివాలయం అర్ధమండపం దక్షిణంవైపు కోష్టదేవతగా నృత్యగణపతి ఉంటాడు. అలాగే శివాలయానికి నైఋతి దిక్కులో పరివారాలయంలో గణపతి పూజలందుకుంటాడు. ప్రధాన దేవతగా అంటే ప్రత్యేకంగా గణపతి దేవాలయం నిర్మించాలనుకుంటే ఆరామాలు, రాజధాని, మనోహరమైన ప్రదేశంలో, పుణ్యప్రదేశంలో, నగరంలో, గ్రామంలో, పట్టణంలో, పురంలో మొదలైన చోట్ల 8దిక్కులా, వీథి మొదట్లో- మధ్యలో, చైత్యవృక్షం నీడన ఇలా అనేక చోట్ల గణపతి ఆలయాన్ని....................