• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Stireekarana Dishagaa Banking Rangam

Stireekarana Dishagaa Banking Rangam By Tummala Kishore

₹ 150

దేశ బ్యాంకింగ్ రంగ ప్రస్థానం

దేశ బ్యాంకింగ్ రంగం గడచిన 76 ఏళ్లలో అనూహ్య మార్పులకు లోనైంది. బ్యాంకింగ్ రంగ పరిణామ క్రమం ఇతర ప్రపంచ దేశాల బ్యాంకింగ్ వ్యవస్థల కంటే భిన్నంగా, సంక్లిష్టంగా జరిగింది. నానాటికీ పెరుగుతున్న దేశ జనాభా, ఆర్థిక, సామాజిక, భౌగోళిక మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రూపాంతరీకరణ చెందుతూ ప్రస్తుతం స్థిరీకరణ దిశగా అడుగులేస్తోంది. ఈ 76 ఏళ్ల ప్రస్థానంలో దేశ బ్యాంకింగ్ వ్యవస్థ ఎన్నో ఆటుపోట్లకు గురైంది. పలు సంక్షోభాలను ఎదుర్కొంది. వరుస సంస్కరణలతో ఒకప్పటి అనియంత్రిత రంగంగా ఉన్న బ్యాంకింగ్ ఇప్పుడు పటిష్టమైన నియంత్రణా యంత్రాంగంతో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా వడివడిగా అడుగులు వేస్తోంది. 76 ఏళ్ల క్రితం బ్యాంకులు చాలీచాలని మూలధనంతో సరైన నియంత్రణ లేక చిన్నపాటి సంక్షోభాన్ని కూడా తట్టుకోలేక విఫలమయ్యేవి. ఆ పరిస్థితి నుంచి బయటపడి మూలధన సమృద్ధితో, పటిష్ఠమైన పర్యవేక్షణ యంత్రాంగంతో, సంక్షోభాలను దీటుగా ఎదుర్కొనే సామర్థ్యంతో దేశ బ్యాంకింగ్ వ్యవస్థ వేగంగా ఎదుగుతోంది.

1947-1955 మధ్య కాలంలో దేశంలోని బ్యాంకులన్నీ ప్రైవేటు రంగంలో ఉండేవి. అప్పట్లో పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు వారి ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు బ్యాంకులను ప్రారంభించేవారు. వారికున్న ఇతర వ్యాపారాలకు అనుబంధంగా బ్యాంకింగ్ వ్యాపారాన్ని వారి స్వప్రయోజనాల కోసం కొనసాగించేవారు. అప్పట్లో బ్యాంకులు ఒక చిన్న సైజు కిరాణా దుకాణం మాదిరి ఉండేవి. అంతేకాక అవన్నీ ఒకే ప్రాంతానికి పరిమితమై బ్యాంకింగ్ సేవలు అందించేవి. అప్పట్లో.............

  • Title :Stireekarana Dishagaa Banking Rangam
  • Author :Tummala Kishore
  • Publisher :Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN5514
  • Binding :Papar Back
  • Published Date :May, 2024
  • Number Of Pages :216
  • Language :Telugu
  • Availability :instock