₹ 150
డాక్టర్ ఎస్పీ సత్యనారాయణ హైదరాబాద్ పాతబస్తీలో 1954 , ఆగస్టు 16 వ తేదీన జన్మించారు. అబ్బూరి రామకృష్ణారావు రచనల పై పరిశోధించి ఎం.ఫీల్. పట్టా పొందారు. "తెలుగులో ఉద్యమగీతాలు " అనే అంశం పై పరిశోధించి పి. హెచ్.డి. సాధించారు. "ఆధునిక తెలుగు సాహిత్యధోరణులు " అన్నా అంశం పై డి. లిట్ డిగ్రీ కోసం మద్రాసు విశ్వవిద్యాలయానికి సిద్ధాంత గ్రంధం సమర్పించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ ఆచార్యునిగా, ఆర్ట్స్ ప్యాకల్టీ డీన్ గా , ఆర్ట్స్ కళాశాల ప్రధానాచార్యులుగా పనిచేసి 2014 లో పదవి విరమణ చేసారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘంలోనూ, భారతీయ అభ్యుదయ రచయితల సంఘంలోనూ క్రియాశీలక పాత్ర పోషించారు. కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులుగా ఒక పర్యాయం ఉన్నారు. ఒక వ్యక్తిగా , వక్తగా , అధ్యాపకుడిగా, సాహితీవేత్తగా, వీరు సాగించిన ప్రయాణాన్ని గురువులు, సహచరులు, శిష్యులు విశ్లేషించిన గ్రంధం "ఆత్మీయం", ఎస్పీ సాహిత్యాన్ని విశ్లేషించిన గ్రంధం "సాహితి యశస్వి" వెలువడినాయి.
- Title :Stri Vivadalu
- Author :Dr S P Satyanarayana , N Suryaprakash
- Publisher :Navachethana Publishing House
- ISBN :MANIMN1064
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :172
- Language :Telugu
- Availability :instock