ఋణానుబంధం
బంగాళాఖాతంలో వాయుగుండం పడింది. రాష్ట్రమంతా వానలు. మాకు రేపటి నుంచి వరుసగా వారంరోజులు సెలవులు. పీజీలో చేరాక ఇంతవరకు ఊరెళ్లలేదు. ఇంటిమీద దిగులేసింది.
సాయంకాలానికి ఈదురు గాలి తగ్గింది. వాన తెరిపిచ్చింది. చెప్పులు కొనటానికి నేనూ, శ్రీశ్రీ (అవును ఇతని పేరూ శ్రీరంగం శ్రీనివాసే!) కలిసి మసీదు సెంటర్ కెళ్లాం. టీలు తాగుతూ, "సెంటర్లో ఒక 'పెట్ట' కూడా తిరగటం లేదు చూశావా దొరా!" అన్నాడు శ్రీశ్రీ. చాలా బిజీ సెంటర్ అది. దొర అని మేమిద్దరం పిలుచుకునేవాళ్లం.
“ఈ వానలకు భయపడి మనం మాత్రం బయటికొచ్చామా దొరా?" అన్నాను ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ.
ఈ సెంటర్కి ఈవినింగ్ ఆరు, ఏడు గంటలప్పుడు ఊర్లో ఉన్న అమ్మాయిలంతా ఏదోవంకతో వస్తారు. ఇక్కడొక గంట నిలబడితేచాలు కాకినాడ మొత్తం చూసినట్టే!
మూడునెలలకు కలిపి నిన్ననే స్టైఫండ్స్ ఇచ్చారు. నా మొదటి సంపాదనతో నాన్నకు చెప్పులు కొనివ్వాలన్న కోరిక ఇవ్వాళ నెరవేరబోతోంది. బాటా షాపులో బ్లూ కలర్ స్లిప్పర్లు తీసుకున్నాను................