ఉగాది
ఉగాది మయూరిలా....
నర్తిస్తూ వస్తోంది
నవ వసంత శోభలతో
కలకూజిత రవళ్ళుతో (రవళులతో)
శుకపికముల సవ్వడితో దివ్యదీపికలతో...
విరాజిల్లుతూ
నవ నవ్యతానురాగాలతో
హావభావాల తోరణాలతో ఆదిగా.... ఆరాధిస్తూ
ప్రేమ మయమయిన
జీవితాన్ని అమృతప్రాయం చేయాలని
ఆర్తిగా....అల్లుకుంటోంది
ఆరాధనగా....
చైత్రానికి చలనం వచ్చినట్లు.............................