పగిలిపోయిన దేహం
ఉదయాన్నే పాపని లేపుతూ
దుప్పటి తీసింది తల్లి ...
దేహమంతా గాయల వాసన
అనుమానం అలజడి రేపింది!
పగిలిపోయింది దేశపు దేహం
X-Y Chromosome
ఆమె పగలు మౌనంతో
రాత్రి ఆవేదనతో
పగలూ, రాత్రీ ఒకే లాగా ఉండిపోతుంది
జీవన శైలిలో
పగలు మొత్తం అలిసిన కనులు
రాత్రిలో వెలిగిన పగలు
పగలు అలిసినా... రాత్రి సోలిసినా
ఆమెది అదే చోటు
వానికో వారసుడినీ ఇస్తే సరి కానీ అది అమ్మాయి అయితే !?...................