₹ 125
లలితా సహస్రనామం ఒక విజ్ఞాన గని. ఇందులో అన్నీ ఉన్నాయి. అందరికీ కావలసినవి ఉన్నాయి. అన్ని వయస్సుల వారికీ కావలసినవన్నీ ఉన్నాయి. లలితా సహస్రనామాన్ని భక్తతో చదివిన వారికి శక్తి, యుక్తులతో పాటు ముక్తి కూడా లభిస్తుంది అనటంలో ఏ కొంచెమూ సందేహంచవలసిన పనిలేదు. చంటి పిల్లవాడికి కన్నతల్లి ఎంత సులభమో లలితా సహస్రనామం చదివే వారికి ఆ జగజ్జనని లలితా పరమేశ్వరి అంత సులభ.
"అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా" అనే నామాన్ని బట్టి చూసినప్పుడు పారాయణ అనేది బహిర్ముఖమే కనుక పరాయణనికి ఆ తల్లి అంత సులభంగా చిక్కదు అనే చెప్పాలి. కానీ ఆలా చెప్ప రాదు. ఎందుకంటే లలితా సహస్రనామ పారాయణ అనేది అన్ని పారాయణల వంటిది కాదు. ఇది చాలా విశేషమైనది. అంతర్ముఖత్వాన్ని ప్రసాదించే శక్తి ఈ లలితా సహస్రనామానికి ఉంది. దీనిని చదువుతూ ఉండగానే భక్తులు ధ్యానమగ్నులు అయిపోతారు. దీని మంత్ర శక్తి అటువంటిది.
- సన్నిధి శ్రీ
- Title :Sulabha Lalitha
- Author :Sannidhi Sri
- Publisher :Visalandhra Book House
- ISBN :MANIMN0501
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :151
- Language :Telugu
- Availability :outofstock