₹ 100
వాల్మీకి మహర్షి సరళమైన, హృద్యమైన అనుష్టుప్ శ్లోకాలలో రామాయణాన్ని మనకి అందించారు.
ఇది అవిచ్ఛిన్నమైన, సత్యమైన, శాశ్వతమైన ఆనందామృతవాహిని.
ఇందులో సోదర ప్రేమ, తల్లిదండ్రుల పట్ల భక్తి, గురువుల పట్ల పూజ్యభావం, మిత్రులపట్ల ప్రేమ, భార్య భర్తల మధ్య అనురాగం, సేవకుల పట్ల ఆదరణ - ఇలా ఒకటేమిటి, మానవ జీవితాన్ని సుసంపన్నం చేసే అనేకవిషయాలు మనకు అందించారు.
ఈ భావాలను మనం రక్షించుకోగలిగితే స్వచ్ఛమైన సముద్రపుగాలివంటి నిర్మలమైన ఆలోచనలు మన మనస్సులలో నిండి ఉంటాయి.
భారతీయ సాహిత్యంలోనే కాదు, ప్రపంచ సాహత్యంలోనే ఆదికావ్యం, అద్వితీయమైన కావ్యం రామాయణం. ఇది మానవజీవితానికి ఒరవడి. మానవుడు ఎలా ఆలోచించాలి? ఎలా మాట్లాడాలి? ఎలా ప్రవర్తించాలి? - అని మనకి చూపించడమే రామాయణం ప్రధాన లక్ష్యం.
రసరమ్యమైన కావ్యం కనుక ఇవే విషయాలని అందంగా, హృదయానికి హత్తుకునేలా చెప్తుంది.
- ఉప్పులూరి కామేశ్వరరావు
- Title :Sundarakandamu
- Author :Uppuluri Kameswara Rao
- Publisher :T. L. P Publications
- ISBN :MANIMN0494
- Binding :Paperback
- Published Date :2016
- Number Of Pages :197
- Language :Telugu
- Availability :outofstock