సుపుత్రికా ప్రాప్తిరస్తు
"తిరుమల ఎందుకండీ"
అతడేమీ మాట్లాలేదు. ఆమెవైపు తిరిగి నవ్వి వార్డ్ రోబ్ తెరచి ఆమె చీరలు రెండు, నాలుగు చుడీదార్ లు తీసి బెడ్ పై ఉంచాడు. అప్పటికే అక్కడ అతని కొన్ని బట్టలు ఉన్నాయి.
"దేవుడు ఉండేచోటు కదండీ..." మాటలు పూర్తికాకముందే ఆమెను గాఢంగా కౌగిలించుకుంటూ పెదవుల్ని గట్టిగా చుంబించాడు. "అప్పుడే మొదలెట్టారా” అంది.
"ఇందుగలడందులేడని సందేహము వలదు. లేనిచోటు వెదకదలచిన ముల్లోకములందూ దొరకదు" అన్నాడు పొయెటిగ్గా.
మళ్లీ తనే “పాపం ఎలా అవుతుందోయ్. ముందు తయారవు. డ్రెస్ మార్చుకో. దీనికోసం దేవుడు లేని చోటు వెతికి పట్టుకోవాలంటే ఈ జన్మకు అది సాధ్యంకాదు” అన్నాడు.
“మొండిఘటం...”అని సణుగుతూ, టవల్ భుజంపై వేసుకుని బాత్రూంలోదూరింది
మొహం కడిగేందుకు బాత్రూంలోకి వెళ్లింది కానీ, చల్లటి నీళ్లు తగిలేసరికి స్నానం చేయాలని అనిపించింది. లో దుస్తులు మాత్రం ఉంచుకుని షవర్ ఆన్ చేసింది. స్నానం కాగానే టవలు తీసుకుంటూ కెవ్వున అరవబోయి, అంతలోనే తమాయించుకుని “ఏమిటిది?" అంది.
భయపడుతున్నట్ల ఆమె భంగిమచూసి "అలవాటు కావాలి డార్లింగ్. బాత్రూంలో ఎంటరయినందుకే అలా అయితే ఎలా..." అని బుగ్గన ఓ చిటికెవేసి, మొహం కడుక్కుని బయటికెళ్లిపోయాడు.
తను టవల్ చుట్టుకుని బాత్రూంలోంచి బయటకు వచ్చేసరికి అతను గదిలోలేడు. డ్రెస్ మార్చుకుంది. బెడ్ పై ఉంచిన బట్టల్ని లెదర్ బ్యాగ్ లో సర్దసాగింది. లోపలికొచ్చి అతనితో "బ్యాగు చాలడం లేదండీ" అంది........