₹ 75
అర్ధరాత్రి
చలిగాలి ఒంటిని వాణికింప చేస్తోంది.
దూరంగా కుక్కల అరుపులు.
చెట్లు గుబురుల్లోంచి దురుకుంటూ మొక్కల్ని పరిశీలిస్తూ ఒక వ్యక్తి ముందుకు సాగిపోతున్నాడు. అతని చేతిలో ఉన్న చమురు దీపం ఆ చీకట్లను చిల్చలేక కావాల్సినంత వెలుగును ప్రసరించలేక గాలికి కొట్టమిట్టాడుతోంది.
భుజాలదాకా పోరాడుతున్న జడలు కట్టిన జుట్టు, బవిరి గెడ్డం. మొలకు గవoచాతో అతను చీకటిలో తిరుగాడుతున్న పిశాచంలా ఉన్నాడు.
హఠాత్తుగా అతను మోకాలిమీద వంగి కూర్చుని దీపాన్ని నేలమీద ఉంచి కళ్ళు మూసుకున్నాడు. అతని పెదాలు విడివడి శబ్దించసాగాయి.
"తృతమాక్షర తంబరం..... క్షిరబ్ది పాదుకం..... నవషనుఖ లబ్ధిదాం.... హిరప్రాప్తి ముక్తికం" అన్న మంత్రం ఉచ్చరించి నేలమీద వెతకసాగాడు.
-కోగంటి విజయలక్ష్మి.
- Title :Surapushpadhara
- Author :Koganti Vijayalakshmi
- Publisher :Madhu Priya Publications
- ISBN :MANIMN0595
- Binding :Paperback
- Published Date :2011
- Number Of Pages :222
- Language :Telugu
- Availability :instock