₹ 180
పరమేశ్వరాను గ్రహముచేతనూ, మరియు నా తండ్రిగా రగు బ్రహ్మ శ్రీ వంగిపురపు సూర్యనారాయణ గారి ఆశీఃపుంజముల చేతను, నా గురు దేవుళ్ళు విధుల చేతను, నా నేర్చిన 27 సంవత్సరముల గణితానుభవము చేతనూ, మంత్రి లక్ష్మీ నారాయణ శాస్త్రులు గారిచే వ్యాఖ్యానింపబడిన గ్రంధాధారముగా ఉదాహరణములతోనూ, భవిష్యత్ మౌఢ్య, గ్రహణ, రాజాది నిర్ణయాదులతోనూ, పంచగ్రహాది ప్రవేశ సూచనలతోనూ,దృద్గణిత తిధి నక్షత్రయోగ కరణములతో విరాజిల్లుచున్న సూర్య సిద్ధాంత పంచాంగ గణితమును ఆదరించాలని అభివాదములు అర్పించుచున్నాను. గణితములో మీకు వచ్చిన అనుమానములను స్వయంగా సంప్రదిస్తే -ఉదాహరణము లతో నేర్పుతాను. శ్రమకు తగినట్లు శాంతిని పొందుచూ ఉండాలన్నదే మా మనవి. అందరూ పంచాంగ కర్తలు కావాలనే ఆకాంక్షతో నాచే వ్యాఖ్యా నింప జేయించిన మరియు ముద్రించిన రాజమండ్రి మోహన్ పబ్లికేషన్స్ వారిని మరువలేనని ఆశీర్వాదములొ సంగుచున్నాను. ఇలాంటి గ్రంథాలు పాఠకలోకానికి అందించగల శక్తి భగవానుడు ఇవ్వాలని అర్థించుచున్నాను.
- శ్రీ వంగిపురపు వీరబ్రహ్మ దైవజ్ఞ