“స్వాతంత్ర్యమంటే?”
తెల్లవారి నిద్ర మెలుకువ వచ్చినా పడుకునే అటు ఇటు బొర్లుతున్నాను. ప్రక్కకు తిరిగి రేడియో ఆన్ చేశాను. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నరు సందేశం అని వినిపించింది. శ్రద్ధగా వింటున్నాను. స్వాతంత్య్రం తర్వాత దేశం ఎంత అభివృద్ధి చెందింది, ఇంకెంత అభివృద్ధి చేయటానికి ప్రభుత్వం ఎలా కృషి చేస్తున్నది చెపుతున్నాడు. మనకు స్వతంత్రం వచ్చింది అన్న భావనతో మనసంతా హాయిగా వుంది. త్వరత్వరగా లేచి తయారయి బయటకు వచ్చాను. మెల్లిగా స్కూలు వైపు వెళ్ళాను. విద్యార్థులందరూ హడావుడిగా వున్నారు. కొంచెం సేపటికి జెండా ఎగురవేసి, ఒక్కొక్కరు స్వాతంత్య్ర ప్రాధాన్యత, దానికి అనేకులు చేసిన - కృషి చెప్పనారంభించారు. అలాగే కొద్ది దూరం నడిచి వెళ్ళాను. గ్రామ పంచాయితీ వచ్చింది. అక్కడ కూడా జెండా ఎగుర వేసి క్లుప్తంగా స్వాతంత్య్ర ప్రాధాన్యత వివరించారు. 8 గం||లు అయింది. ఆ రోడ్డు వెంబడే నడవడం ఆరంభించాను.
"నమస్కారం సార్! ఏంది ఇటువైపు పోతుండరు" అని ఒకరు పలుకరించారు. అంతవరకు ఒక ట్రాన్సులో నడిచిపోతున్న నాకు బ్రేకు పడింది. హఠాత్తుగా చూద్దును కదా అక్కడ అన్నీ గుడిసెలే కనిపించాయి. అక్కడ ఎవరికి ఎటువంటి హడావుడి లేదు. ఎవరి పనులు వారు చేసుకుపోతున్నారు. రోడ్లన్నీ బురదమయం. అక్కడే కొందరు బాసన్లు తోముతున్నారు. కొందరు మోఖాలు కడుగుతున్నారు. అక్కడే మురికి కాల్వలు. ఎవ్వరు స్నానాలు చేసినట్లుకాని, ఇంటిని, పిల్లల్ని శుభ్రంగా వుంచినట్లు కాని కనపడలేదు. దేశం అభివృద్ధి చెంది........................