• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sutta Pitaka Dighanikaya 1st Part Shilaskanda Vargam

Sutta Pitaka Dighanikaya 1st Part Shilaskanda Vargam By Bikshu Darmarakshita

₹ 500

నమో తస్స భగవతో అరహతో సమ్మాసంబుద్ధస్స

దీఘనికాయ - శీలస్కంధవర్గం
1. బ్రహ్మజాల సూత్రం

పరివ్రాజక కథ

1 నేనిలా విన్నాను - ఒక సమయంలో భగవానుడు అయిదువందల భిక్షువులు గల పెద్ద భికుసంఘంతో రాజగృహ నగరానికి నాలందాకు మధ్య త్రోవలో నడుస్తున్నాడు. సుప్రియ పరివ్రాజకుడు కూడా తన శిష్యుడు బ్రహ్మదత్తమాణవకుని (మాణవకుడు - యువబ్రహ్మచారి) తో రాజగిరికి - నాలందాకు మధ్య త్రోవలో నడుస్తున్నాడు. అప్పుడు సుప్రియపరివ్రాజకుడు అనేకవిధాలుగా బుద్దున్ని నిందిస్తూ మాట్లాడాడు. ధమ్మాన్ని నిందిస్తూ మాట్లాడాడు. సంఘాన్ని నిందిస్తూ మాట్లాడాడు. కాని సుప్రియ పరివ్రాజకుని శిష్యుడు బ్రహ్మదత్తమాణవకుడు అనేక విధాలుగా బుద్దున్ని ప్రశంసిస్తూ మాట్లాడాడు. ధమ్మాన్ని ప్రశంసిస్తూ మాట్లాడాడు. సంఘాన్ని ప్రశంసిస్తూ మాట్లాడాడు. ఇలా ఆ గురుశిష్యులిద్దరూ ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడుకుంటూ, భగవానునికి, బికుసంఘానికి వెనుక వెనుకనే నడిచారు.

  1. అప్పుడు ఆ ఒకరాత్రి గడపడానికి భగవానుడు భిక్షుసంఘంతో పాటు అంబలటికలోని రాజాగారానికి (= పర్యటనలో రాజు విడిదిచేసే ఇల్లు) చేరుకున్నాడు. సుప్రియ పరివ్రాజకుడు కూడా తన శిష్యుడు బ్రహ్మదత్తమాణవకునితో పాటు ఆ రాత్రి గడపడానికి, అంబలటికలోని రాజాగారానికి చేరుకున్నాడు. అక్కడ కూడా సుప్రియ పరివ్రాజకుడు అనేక విధాలుగా బుద్దుని నిందించాడు. ధమ్మాన్ని నిందించాడు. సంఘాన్ని నిందించాడు. కాని సుప్రియ పరివ్రాజకుని శిష్యుడు బ్రహ్మదత్తమాణవకుడు.........

  • Title :Sutta Pitaka Dighanikaya 1st Part Shilaskanda Vargam
  • Author :Bikshu Darmarakshita
  • Publisher :Mahabhodi Buddha vihara Hyd
  • ISBN :MANIMN3675
  • Binding :Hard Binding
  • Published Date :March, 2017
  • Number Of Pages :375
  • Language :Telugu
  • Availability :instock