• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Sutta Pitaka Dighanikaya 2nd Part Maha Vargam

Sutta Pitaka Dighanikaya 2nd Part Maha Vargam By Bikshu Darmarakshita

₹ 500

నమో తస్స భగవతో అరహతో సమ్మాసంబుధస్స

దీఘనికాయ - మహావర్గం
1. మహాపదాన సూత్రం

పూర్వజన్మల కథనం

1. నేనిలా విన్నాను - ఒక సమయంలో భగవానుడు శ్రావస్తిలో, జేతవనంలో అనాథపిండికుని ఆరామంలో కరేరి (musk-rose tree) కుటీరంలో ఉన్నాడు. అప్పుడు అనేకమంది భిక్షువులు భోజనం చేసి, పిండపాతంనుండి తిరిగివచ్చిన తర్వాత గుండ్రని మంటపంలో సమావేశమై కూర్చొని, - పూర్వజన్మలో ఇది ఇలా ఉండేది. ఇది ఇలా ఉండేది" అంటూ ధార్మికచర్చను మొదలుపెట్టారు.

  1. మానవుల వినికిడి శక్తికి అతీతమైన, పరిశుద్ధమైన, దివ్యమైన వినికిడి శక్తితో భగవానుడు వారి మాటలను విన్నాడు. అప్పుడు భగవానుడు ఆసనం నుండి లేచి ఆ గుండ్రని మంటపం వద్దకు చేరుకున్నాడు. చేరుకొని వేయబడిన ఆసనంపై కూర్చున్నాడు. కూర్చున్న ఆ భగవానుడు భిక్షువులను , సంబోధించి - "భిక్షువులారా, ఇలా కూర్చొని దేనిగురించి మాట్లాడుకుంటున్నారు. నేను రావటం | వలన మీ ఏ చర్చకు అంతరాయం కలిగింది?" అన్నాడు.

అలా అనగా భిక్షువులు భగవానునితో - "ఇక్కడ, భంతే మేము భోజనం చేసిన తర్వాత పిండపాతం | నుండి తిరిగివచ్చి గుండ్రని మంటపంలో సమావేశమై కూర్చొని - పూర్వజన్మలో ఇది ఇలా ఉండేది. పూర్వజన్మలో ఇది ఇలా ఉండేది' అంటూ ధార్మిక చర్చను ఆరంభించాము. భగవానుడు , రావటం వలన అంతరాయం కలిగిన చర్చ ఇదే" అన్నారు.

  1. బిక్షువులారా, మీకు పూర్వజన్మలకు సంబంధించిన ధార్మిక కథనాన్ని వినాలని ఉందా?" "భగవాన్, సుగతా, భగవానుడు పూర్వజనుల గురించిన ధార్మిక కథనాన్ని చెప్పటానికి తగిన సమయం...................

  • Title :Sutta Pitaka Dighanikaya 2nd Part Maha Vargam
  • Author :Bikshu Darmarakshita
  • Publisher :Mahabhodi Buddha vihara Hyd
  • ISBN :MANIMN3676
  • Binding :Hard Binding
  • Published Date :Oct, 2017
  • Number Of Pages :439
  • Language :Telugu
  • Availability :instock