• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sutta Pitaka Dighanikaya 3rdt Part Pathika Vargam

Sutta Pitaka Dighanikaya 3rdt Part Pathika Vargam By Bikshu Darmarakshita

₹ 500

నమో తస్స భగవతో అరహతో సమ్మాసంబుద్ధస్స

దీఘనికాయ - పాథికవర్గం

  1. పాథిక సూత్రం

సునక్బత్తుని విషయం

1. నేనిలా విన్నాను - ఒక సమయంలో భగవానుడు మల్లదేశంలో అనుపియ అనే పేరుగల మల్లుల పట్టణంలో ఉంటున్నాడు. అప్పుడు భగవానుడు పూర్వాహ్నసమయంలో చక్కగా కప్పుకొని పాత్రచీవరాలను తీసుకొని అనుపియలో భిక్షకోసం ప్రవేశించాడు. అప్పుడు భగవానునకు ఇలా అనిపించింది - "అనుపియలో భిక్షకు ఇంకా చాలా సమయం ఉంది. (ఈ లోపున) నేను తప్పక భగవగోత్ర పరివ్రాజకుడు ఉండే భగ్గవ (భార్గవ) పరివ్రాజక ఆరామానికి వెళ్లాలి". |

  1. అప్పుడు భగవానుడు భగ్గవగోత్ర పరివ్రాజకుడు ఉండే భగ్గవ పరివ్రాజక ఆరామానికి , వెళాడు. అప్పుడు భగవగోత్ర పరివ్రాజకుడు భగవానునితో - "భస్తే, భగవాన్, స్వాగతం. భంతే, భగవానుడు చాలాకాలానికి ఇక్కడికి రావటం తటస్థించింది. ఇదిగో, ఆసనం వేయబడి ఉంది. భంతే, భగవానుడు కూర్చుండుగాక" అన్నాడు. భగవానుడు వేయబడిన ఆసనంలో కూర్చున్నాడు. ఆ భగవగోత్ర పరివ్రాజకుడు కూడా ఎత్తుతక్కువగల ఒక ఆసనంపై ఒక పక్కన కూర్చున్నాడు. ఒకపక్కన కూర్చున్న ఆ భగ్గవగోత్ర పరివ్రాజకుడు భగవానునితో ఇట్లన్నాడు - "భంతే, వెనకటికి చాలాదినాల కిందట లిచ్ఛవిపుత్రుడు సునక్షత్తుడు (సునక్షత్రుడు) నా వద్దకు వచ్చాడు; వచ్చి నాతో "భగవా, నేను భగవానుని వదలి పెట్టాను. నేనిప్పుడు భగవానుని ఆశ్రయించుకొని ఉండటం లేదు" అన్నాడు. భంతే, లిచ్ఛవిపుత్రుడు సునక్షత్తుడు అన్నది నిజమేనా?" "భగ్గవా, లిచ్ఛవిపుత్రుడు సునక్షత్తుడు అన్నది నిజమే”......
  2.  

  • Title :Sutta Pitaka Dighanikaya 3rdt Part Pathika Vargam
  • Author :Bikshu Darmarakshita
  • Publisher :Mahabhodi Buddha vihara Hyd
  • ISBN :MANIMN3677
  • Binding :Hard Binding
  • Published Date :April, 2018
  • Number Of Pages :417
  • Language :Telugu
  • Availability :instock