• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sutta Pitaka- Khuddaka Nikaya Suttanipata

Sutta Pitaka- Khuddaka Nikaya Suttanipata By Annappareddy Venkateswara Reddy

₹ 400

భగవానుడు, అరహతుడూ అయిన ఆ సమ్యక్ సంబుద్ధునికి నమస్కారం

ఖుద్ధకనికాయం -సుత్తనిపాతం

I ఉరగవగ్గ
1. ఉరగసుత్తం
దేహంలో ఎగబ్రాకిన పాము విషాన్ని విరుగుడు మందులతో విరిచినట్లు, తనలో రేగిన క్రోధాన్ని దూరం చేసే భిక్షువు, సర్పం తన కుబుసాన్ని (జీర్ణమైన పాతచర్మాన్ని) వదిలినట్లు, ఈ తీరాన్ని, ఆ తీరాన్ని (ఇహ పరలోకాలను) వదిలేస్తాడు.

సరోవరంలో పెరిగే పద్మాన్ని ఒకడు నీటిలో మునిగి తుంచివేసినట్లుగా, రాగాన్ని పూర్తిగా తొలగించిన భిక్షువు, సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు, ఈ తీరాన్ని, ఆ తీరాన్ని వదిలేస్తాడు.

జలజల పారే యేటిని ఇంకించినట్లుగా తృష్ణను పూర్తిగా అణచిన భిక్షువు, సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు, ఈ తీరాన్ని, ఆ తీరాన్ని వదిలేస్తాడు.

కాకివెదురు బొంగులతో నిర్మితమైన పేలవమైన వంతెనను మహోధృతమైన వరద కొట్టివేసినట్లు, అహంకారాన్ని నిశ్శేషంగా తుడిచిపెట్టిన భిక్షువు సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు, ఈ తీరాన్ని, ఆ తీరాన్ని వదిలేస్తాడు.

మేడిచెట్టు (అత్తిచెట్టు మీద పూలను వెతికిన వానిలా, సంసారంలో సారం కానని భిక్షువు సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు, ఈ తీరాన్ని, ఆ తీరాన్ని వదిలేస్తాడు.

అంతరంగంలో (హృదయంలో) కోపతాపాలు లేనివాడై, భవాభవాలను అధిగమించిన భిక్షువు, సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు, ఈ తీరాన్ని, ఆ తీరాన్ని వదిలేస్తాడు.

అనేక విధాలైన ఆలోచనలను భగ్నం చేసి, నిశ్శేషంగా అంతరంగం నుంచి తుడిచిపెట్టిన భిక్షువు, సర్పం తన కుబుసాన్ని వదిలినట్లు, ఈ తీరాన్ని, ఆ తీరాన్ని వదిలేస్తాడు

  • Title :Sutta Pitaka- Khuddaka Nikaya Suttanipata
  • Author :Annappareddy Venkateswara Reddy
  • Publisher :Mahabhodi Buddha vihara Hyd
  • ISBN :MANIMN3678
  • Binding :Hard Binding
  • Published Date :July, 2015
  • Number Of Pages :315
  • Language :Telugu
  • Availability :instock