• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Sutta Pitaka Majjhimanikaya 3rd part Uparipannasapali

Sutta Pitaka Majjhimanikaya 3rd part Uparipannasapali By Bikshu Darmarakshita

₹ 800

నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్సు

మళీమనికాయ - ఉపరిపక్షాసపాలి

1. దేవదహ వర్గం

 

1. దేవదహ సూత్రం


1. నేనిలా విన్నాను - ఒక సమయంలో భగవానుడు శాక్యదేశంలో దేవదహ అనే శాక్యుల పట్టణంలో ఉంటున్నాడు. అక్కడ భగవానుడు భిక్షువులను "భిక్షువులారా" అని సంబోధించాడు. "భదంతా" అని భిక్షువులు భగవానునికి బదులు పలికారు. భగవానుడు ఇట్లన్నాడు - కొందరు శ్రమణ, బ్రాహ్మణులు ఈ విధమైన వాదంతో, దృష్టితో ఉంటారు - వ్యక్తి (పురుషుద్దలుడు) అనుభవించే సుఖం, దుఃఖం, అసుఖం, అదుఃఖమసుఖాలకు పూర్వకర్మనే కారణం. తపస్సుతో పూర్వకర్మను లేకుండా చేసుకొని, కొత్తకర్మలను చేయకుండా ఉంటే చిత్తమలినాలు లేనివాడవుతాడు; చిత్తమలినాలను లేకుండా పోవటం వలన కర్మ నశిస్తుంది; కర్మ నశించటం వలన దుఃఖం నశిస్తుంది; దుఃఖనాశనం వలన వేదన నశిస్తుంది; వేదన నశించటం వలన దుఃఖం పూర్తిగా నశిస్తుంది. అక్షువులారా, నిగంరువులు ఇలా అంటుంటారు.

"భిక్షువులారా, ఇలా వాదించే నిగంగుల దగ్గరకు పోయి, నేను ఇలా అన్నాను - 'నిజంగానే నిగంరువులారా, మీరు - వ్యక్తి (పురుషపునీలుడు) అనుభవించే సుఖం, దుఃఖం, అదుఃఖమసుఖాలకు పూర్వకర్మయే కారణం. తపస్సుతో పూర్వకర్మను లేకుండా చేసుకొని, కొత్తకర్మలను చేయకుండా ఉంటే చిత్తమలినాలు లేనివాడవుతాడు; చిత్తమలినాలను లేకుండా పోవటం వలన కర్మ నశిస్తుంది; కర్మ నశించటం వలన దుఃఖం నశిస్తుంది; దుఃఖనాశనం వలన వేదన నశిస్తుంది: వేదన నశించటం | వలన దుఃఖం పూర్తిగా నశిస్తుంది అనే దృష్టితో ఉన్నారా?" భిక్షువులారా, అందుకు వారు 'అవును' అని తెలియజేశారు..........

  • Title :Sutta Pitaka Majjhimanikaya 3rd part Uparipannasapali
  • Author :Bikshu Darmarakshita
  • Publisher :Mahabhodi Buddha vihara Hyd
  • ISBN :MANIMN3674
  • Binding :Hard Binding
  • Published Date :July, 20202
  • Number Of Pages :595
  • Language :Telugu
  • Availability :instock