థేరీ గాథలు
అజ్ఞతరా థెరిక పలికిన "సుఖం సుపాహి థేరికే, కత్వా చోళేన పారుతా" అనే గాథ ఎలా పుట్టింది?
కోణాగమన బుద్ధుని కాలంలో ఈ థేరిక క్షత్రియకులంలో జన్మించి భగవానుని ధమ్మంపట్ల శ్రద్ధ కలిగి ఒక రోజు ఆయనను తన నివాసానికి ఆహ్వానించింది. మొదటి రోజు అతిధి సత్కారాలు చక్కగా నిర్వర్తించింది. రెండవ రోజు చెట్టు కొమ్మలతో ఒక మండపం నిర్మించి దానిని పువ్వులతో అలంకరించింది. దానిపై గోపురాన్ని నిర్మించింది. మండపంలో మంచి ఆసనం వేయగా కోణాగమన బుద్ధ భగవానుడు ఆశీనుడయ్యాడు. ధర్మం ఉపదేశించిన తరువాత ఆయనకు మంచి భోజనాన్ని సమర్పించి, మూడు చీవరాలను దానం చేసింది. బుద్ధ భగవానుడు సంతోషించి ఆశీర్వదించాడు. భూలోకంలో ఆయుషు తీరగానే ఆ పుణ్య బలంతో స్వర్గలోకంలో సుఖాలను అనుభవించి కశ్యప బుద్ధుని కాలంలో గృహిణిగా జన్మించింది.
సంసారం పట్ల వైరాగ్యం కలిగి సంబుద్ధ శాసనంలో ప్రవ్రజ్య తీసుకొంది. ఎన్నో జన్మల్లో ఇరువది ఒక్క వేల సంవత్సరాలు భిక్షుణీ శీలాలను పాటించింది. తరువాత స్వర్గ సుఖాలను అనుభవించి చివరిగా ఇప్పటి బుద్ధభగవానుని శాసన కాలంలో లిచ్ఛవీ గణతంత్ర రాజ్యంలోని వైశాలిలో రాజవంశానికి చెందిన ఒక గృహిణిగా జన్మించింది.
బుద్ధభగవానుని ధర్మవాణి ఆమె చెవుల్లో, ఆమె మనస్సులో ప్రతిధ్వనిస్తుంది. జీవితం పట్ల వైరాగ్యం కలిగింది. కానీ ఇల్లు వదలడానికి భర్త అనుకూలంగా లేకపోవడంతో అతనిని నొప్పించడం గృహస్తు జీవితం గడుపుతూ ఇలాలిగా తన కర్తవ్యం నిర్వహించసాగింది. ఒకరోజు వంటగదిలో
మట్టిపాత్రలో కూరని వండుతూ అందులో పులుసుపోయడం మరచిపోయింది. కొంత సేపటికి వచ్చి, చుస్తే ఆ కూరంతా మాడిపోయి ఉంది. ప్రతి గృహిణి జీవితంలోనూ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటివి , జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ సామాన్య ఘటన ఆమెకు ధమ్మప్రేరణనిచ్చింది. సంస్కారాలన్ని అనిత్యమైనవే! వీటిని ఆస్వాదించడమనే రసాన్ని ఎండగడితే సంస్కారాలు కూడా కూరవలెనే ............