• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Swapna Sagaram

Swapna Sagaram By Dr Gujju Chenna Reddy

₹ 200

స్వప్నసాగరం

రవి... రవి... నిద్రలేవరా... అసలు అలారం ఎన్నిసార్లు మోగిందో వింటున్నావా ముసుగు తీయరా... దుప్పటి తీయరా... అసలు ఈ అలారం పెట్టుకోవడం ఎందుకు? అది మోగుతుంటే నిద్రమత్తుతో తడుముతూ ఆపేయడం ఎందుకురా?!... గతరాత్రి నిద్రపోయేటపుడు ఏమి అనుకున్నావో గుర్తుందా? ఈ రోజులా రోజూ చదివితే ఐ.ఏ.ఎస్. అధికారిని అవుతానని? అన్నావు. మరి ఏమైపోయిందిరా నీకు ఆ పౌరుషం? అసలు వీడికి పిల్లనిచ్చేదేముంది? మన అమ్మాయికి రెండుపూట్ల భోజనం పెట్టగలడా? అని మీ మేనమామ అన్న మాటలు గుర్తురావడం లేదూ? ఒక్కసారి ఇంటర్మీడియట్ తప్పి, ఒక సంవత్సరం ఆలస్యం అయిపోతే నీ స్నేహితులంతా 'వీడొక్కడే మనలో గ్రాడ్యుయేట్ కాలేకపోయాడురా, అన్న ఆ మాటలు నీ చెవిలో రింగుమనడం లేదూ? ఈసారి అలారం మళ్లీ మోగకముందే లేవరా... అసలు నీవెందుకు ఇంటర్మీడియట్ తప్పావో వారికి ఏం తెలుసురా? నీ మనస్సాక్షికి తప్ప!... కాని అవన్నీ సమాజం లెక్కలోకి రావురా... సమాజం చూసేది ఫలితాల కోసమేరా... ఫలితాలు నిబద్ధతతో సాధిస్తేనే గౌరవం రా... లేవరా... నాలుగు పేపర్లు రాసావు. ఈరోజు ఇంకా ఒక్కపేపర్ సరిగా రాస్తే చాలుకదా! నీవు డిగ్రీ పట్టభద్రుడవు అయిపోతావు. అదీ బుల్లయ్య కాలేజీలో! అదీ విశాఖపట్టణంలో! ఈ డిగ్రీ సంపాదించడానికి ఒక ఏడాది ఆలస్యం కావడంతో నీవు గ్రామంలో ఎదుర్కొన్న అవమానాలు ఇన్నన్ని కావు. మరి డిగ్రీ పూర్తికాలేదని నీవే ఇంత ఫీల్ అయితే, మరి మీ నాన్నగారిని ఎవరైనా అడిగి ఉండరా? అతని స్నేహితులు 'ఏం ఓయ్! మీవాడి డిగ్రీ పూర్తి అయిందా?' అని అడగరా? ఆ పెరడులో ఉన్న తులసిమొక్కకు వేకువన, వెలుగు రాకుండానే, దీపం పెట్టే అమ్మ ఎన్ని మొక్కులు మొక్కి ఉంటుందో తెలుసురా?... అసలు................

  • Title :Swapna Sagaram
  • Author :Dr Gujju Chenna Reddy
  • Publisher :Vishalandra Publishing Housing
  • ISBN :MANIMN5873
  • Binding :Papar Back
  • Published Date :Oct, 2024
  • Number Of Pages :227
  • Language :Telugu
  • Availability :instock