ఉపోద్ఘాతం
స్వర్ణ ద్వీపం నవల సరికొత్త వలస వాదం పైన ఒక రాజకీయ కథారూపకం. రచయిత వ్యక్తిగత పురాణం ద్వారా సమర్పితం. స్వర్ణ ద్వీపం అనే ఒక ఊహాలోకపు మూడో ప్రపంచపు దేశం భవిష్యత్తు ఈ నవల ప్రయాణం. స్వర్ణ ద్వీపం వినిమయతత్వం పై బుద్ధి హీనత దాడిని ఎదుర్కొంటుంది. ఈ నవల ఎత్తుగడ బలమైన కథా గమనంతో వెల్లడి అవుతుంది. భారతదేశపు సివిల్ సర్వీస్ ఉద్యోగి అభిషేక న్ను స్వర్ణ ద్వీపం ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి విభాగానికి డెప్యుటేషన్ మీద పంపుతుంది. అభిషేక్ భార్య, తల్లి ఇద్దరు చిన్న పిల్లలను ఒరిస్సా (ఇండియా) లో వదిలి బయలు దేరతాడు. ఈ డెప్యుటేషన్ ట్రాన్స్ఫర్ ఆపమని ముఖ్యమంత్రిని వేడుకునే నిమిత్తం అతను అయనను దేబిరించలేడు. - అతనిలోని నియమ బద్ధత గల యోధుడు దానికి అంగీకరించడు.
అభిషేక్ ఆ కొత్త దేశం భవిష్యత్తు అసంబద్ధత పట్ల దిగులుపడతాడు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం బయటి అధికారాలు రిమోట్ కంట్రోల్లో ఉంచుకుంటాయి. ఒకసారి ఆ స్వర్ణ దేశపు శాంతి ప్రేమికులైన సువర్ణపురవాసులు రోజుకి రెండు పూటలా అన్నం చేపల భోజనం గురించి ఆలోచించటం వల్ల వారిని డాఫోడిల్ తోటల డిక్టాట్ కి తరలించి ప్రపంచ బాంక్కు మద్దతునిచ్చారు. దేశం విదేశీ తరహా కార్లను, ఎలెక్ట్రానిక్ భాగాలను దిగుమతి చేసుకుంటుంది కాని పూర్తి చేసిన వస్తువులను ఎగుమతి చెయ్యలేదు. కార్లకు అవసరమైన విడి భాగాలు స్వర్ణ ద్వీపం రాజధాని స్వర్ణ పూర్లో దొరకవు. ఎలాగూ దేశం ఆయిల్ను బయటనుండే కొనుక్కోవాలి.
ఉన్నట్టుండి ఒక సాంకేతిక నిపుణుడైన రాజకీయవేత్త ఆ విషయాలకు చుక్కానిగా మారి ఆయిల్ పైప్ లైన్ విధానం అతని గొప్ప పథకాన్ని ప్రకటిస్తాడు. అయితే ఇక్కడ చమత్కారంగా ఆ దేశ ప్రధాని - ప్రసిద్ధులైన అతని పూర్వీకులు వదిలేసిన పీఠం ఎక్కినవాడు, తన కార్ను విమానం లా ఎగిరేలా చెయ్యడం ప్రేమించే వాడు, ఆధునిక పురాణాలు నమ్మి, తన కుతంత్రపు రాజకీయ సహచరుల ముసుగులా ఉంటాడు.....................