• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Swarna Dweepa Yatra

Swarna Dweepa Yatra By Vasundhara

₹ 200

స్వర్ణ ద్వీప యాత్ర

అనగా అనగా చంపక దేశం. ఆ దేశానికి రాజు ధనంజయుడు. ఆయన భార్య సావిత్రి. అనుకూలవతి, రూపవతి, ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే ఆ దంపతులకు బిడ్డలు లేకపోవడం లోటు. అందుకని ఎప్పుడూ విచారంగా ఉండేవారు.

ధనంజయుడి మంత్రి సంజయుడు. ఆయన చాలా తెలివైనవాడు. కానీ అధికార వ్యామోహం బాగా ఎక్కువగా ఉంది. రాజుకు బిడ్డలు లేరని ఆయనకు చాలా సంతోషంగా ఉండేది. తన భార్య సుమతి పండంటి మగబిడ్డను కన్నాక ఆ సంతోషం రెట్టింపయింది. ఆయన వాడికి వినయుడని పేరుపెట్టాడు.

సావిత్రికి పిల్లలంటే యిష్టం. మంత్రికుమారుడు వినయుణ్ణి చూసి ఆమె ఎంతో ముచ్చట పడేది. అందుకని ప్రతిరోజూ సుమతి వినయుణ్ణి తీసుకుని రాణితో కాసేపు గడిపి వెళ్లేది.

వినయుడు వెళ్లిపోయాక కూడా రాణి వాడి చేష్టలనే తల్చుకునేది. మహారాజు వచ్చినపుడు రాత్రి ఆయనకు వాడి చేష్టలు వర్ణించి చెప్పేది. ఇద్దరూ వినయుణ్ణి తల్చుకుని పరమానందం చెందేవారు.

ఒక రోజున ధనంజయుడు మంత్రిని పిలిచి, "సంజయా! వయసులో నాకంటే చిన్నవాడివి. కానీ నాకంటే ముందు తండ్రివైనావు. ఈ ప్రపంచంలో ఎన్ని రాజ్యభోగాలున్నా అది అదృష్టం కాదు. సంతానాన్ని మించిన సంపద లేదు. అయితే నీ కుమారుడు వినయుడి కారణంగా నాకు సంతానం లేదన్న దిగులు లేకుండా పోయింది. రాణి కూడా ఆ చిన్నారిని చూసి ఎంతో మురిసిపోతోంది. బాగా ఆలోచించి నేనొక నిర్ణయానికి వచ్చాను. నాకు సంతానయోగం లేకపోతే కనుక నేను రాజబంధువుల కోసం వెదకను. వినయణే నాకు వారసుడిగా ప్రకటిస్తాను" అన్నాడు.

అప్పుడు సంజయుడిక్కలిగిన ఆనందమంతా అంతాకాదు. అతికష్టం మీద సంతోషాన్నణచి పెట్టుకుని, "ప్రభూ! తమరలాగంటే నాకు దుఃఖం ముంచుకొస్తోంది. ఈ రోజు నేను చెబుతున్నాను వినండి. తర్వలోనే తమకు సంతానయోగం.................

  • Title :Swarna Dweepa Yatra
  • Author :Vasundhara
  • Publisher :Classic Books
  • ISBN :MANIMN6666
  • Binding :Papar Back
  • Published Date :Nov, 2025
  • Number Of Pages :205
  • Language :Telugu
  • Availability :instock