స్వర్ణగోపురం
చీకటిపడటానికి ఇంకో అర్థఘడియ సమయం వున్నప్పుడు చంపకవల్లి గ్రామంలోకి ప్రవేశించాయి మూడు పెద్ద పెద్ద వృషభ శకటాలు. ఆనందమైపోయింది రచ్చబండ దగ్గిర కూర్చుని కాలక్షేపం చేస్తున్న గ్రామస్థులందరికీ. “దమ్మాలశెట్టి వచ్చేశాడు... ఉప్పుబండితోపాటు పప్పుదినుసుల్ని, వస్త్రాల మూటల్ని తీసుకువచ్చేశాడు" బిగ్గరగా అరుస్తూ ఇళ్ళ దగ్గర వుండిపోయిన తమ సహచర గ్రామస్థుల్ని హెచ్చరించారు వారిలో కొందరు.
వంజర రాజ్యానికి ఉత్తరదిశలో వుంటుంది చంపక వల్లి గ్రామం. చుట్టూ దట్టమైన అడవి... రెండు రోజుల పాటు ప్రయాణం చేస్తే తప్ప మరో గ్రామం కనిపించదు. తిండిగింజలు గ్రామంలోనే లభిస్తాయి. మిగిలిన వస్తు సముదాయం మాత్రం దమ్మాలశెట్టి తీసుకువస్తేనే దొరుకుతాయి.
రాజధాని నగరం అయిన కుశాల నగరం నుంచి వృషభ శకటాల మీద తీసుకువస్తాడు ఆ శెట్టి...................