మేదరవ్వ
కిరణాల చూపులు గుమ్మానికి సోకగానే
ఆమె వెదురు బద్దల్ని ఏకం చేసి
బాల బాంధవుడి ప్రతీకలా మధ్యన పరచి
బుట్టను అల్లడం మొదలెడుతుంది.
తొడమీద రక్షగా నిలిచిన
రబ్బరు తొడుగుపై బొంగను పోనిస్తూ
దశాబ్దాల అనుభవమున్న మచ్చు కత్తితో
చెక్కుతుంటే
మెరుపు మెరిసిన శబ్దంలా పటపటా విరిగేది.
మరింత లోతుకు చిరు కత్తితో చీలుస్తుంటే
పాయలు పాయలుగా బద్దలు
తరంగాల్లా కదులుతూ ప్రక్కకు జారిపడేవి.
అడుగు భాగానికి అనుకూలంగా
బద్దలపై బద్దను కూర్చుతూ........................