మన కథా మూలాల సౌరభం
ఏ కథ అయినా చదివినపుడు, అది మనకేం చెబుతుంది? కథ స్థల కాలాల్లో నడుస్తుంది, లేదా నిర్మించబడుతుంది. కథలో పాత్రలుంటాయి. ఆ పాత్రలకు ప్రదేశమూ, ప్రవర్తన, ఆలోచనలు, దానికి తగినట్లుగా తీర్చుతారు. ఇక్కడే కథకుడి సామాజిక స్థితి మనకవగతమవుతుంది. ఇక కథలోకి పోతే, ఆ కథ రాసిన కాలపు చరిత్ర, సంఘంలోని సమస్త ఆలోచనలు, న్యాయ న్యాయాలు, ధర్మాలు, నీతులు... మొత్తంగా సంస్కృతి అస్పష్టంగానైనా ప్రస్ఫుటమవుతుంది. మనిషి నేలపై నిలబడే ఊహ చేయగలడు. కథ ద్వారా ఆనాటి సమాజ స్థితిగతులను అంచనా వేయటం ఎప్పటి నుండో ఉంది. ఎందుకంటే చరిత్రను సమాజ కేంద్రంగా రాయటంగానీ, చెప్పటం గానీ జరగటం అరుదు ఇక్కడ. కాబట్టి రచనలు, కవిత్వం, కథ, నవల మొదలైన సృజనాత్మక రచనల ద్వారా పరిశోధకులు ఆయా కాలాల గమనాలను అంచనా వేయగలిగారు.
ఆధునిక కథలు ముఖ్యంగా సాధారణ ప్రజల మధ్య సంబంధాలను, అందుకు ప్రాతిపదికగా ఉన్న అనేక అంశాలను చర్చకు తెస్తాయి. కనుక కథ మనకు, మన ప్రాంతం గురించి లేదా కథాస్థలాన్ని గూర్చి చాలా విషయాలు బోధపరుస్తుంది. కథా వస్తువు, దాని శిల్పం కూడా పరిశోధకులకు బోలెడన్ని అంశాలను అందిస్తాయి. పూర్వపు కథలు చదివినపుడు లేదా మనకు ఓ వందేళ్ల క్రితపు కథలు చదివినప్పుడు, మనమిప్పుడు ఎంత దూరం పరిణామం చెందుతూ వచ్చామో అర్ధమవుతుంది. ఇవన్నీ సాధారణ విషయాలే. కానీ మన గతంలోని జ్ఞాపకాలను, ఆనాటి జీవన విధానాలను ఒకసారి దృశ్యమానం చేసుకోవడంలో ఒక గొప్ప అనుభూతితో పాటు, సమాజ పరిణామాల క్రమమూ కళ్లముందు. కనపడుతుంది. పరిశోధకులు చేసే పని ఇది. ఆ దృష్టితో పరిశీలించడం కోసం చేసే శ్రమ, భావితరాలకు ఒక దిక్సూచిగా పనిచేస్తుంది. ఇప్పుడు, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక, ఈ ప్రాంతంలో సాంస్కృతికపరమైన జీవనం గురించిన పరిశోధన................