• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Taittiriya Panchakaraka Panchopanishad

Taittiriya Panchakaraka Panchopanishad By Dwibhasyam Subramanya Sastri

₹ 180

తావని హరినామాని కీర్తితాని నసంశయః || పరమపవిత్రమైన వేదములో ముఖ్యమైన తైత్తిరీయ కృష్ణ యజుర్వేదములో వైదికులకు నిత్యోపయుక్తమైన పబ్బుకారక పజ్చోపనిషధః తెలుగు వైదికులకు ఒకే పుస్తకరూపములో లభ్యమగుటలేదనియు అట్టి ప్రయత్నము మమ్ము చేయమని వైదిక సోదరులు కోరుటచే విద్యార్థి లోకమునకు, వైదికసోదరులకు ఉపయుక్తమగు రీతిలో సస్వరముగా ఈ గ్రంథమును మా పరమపూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ రావూరి లక్ష్మీనారాయణ అవధాని మహోదయుల కృపతోను మా పరమపూజ్య మాతాపితరులు ద్విభాష్యం సుబ్బలక్ష్మీ వేంకటేశ్వర్లు గార్ల దివ్య ఆశీస్సుల ప్రభావము చేతను, వేదమూర్తులైన బ్రహ్మశ్రీ మహంకాళి వేంకటరామమూర్తి అవధాని అన్నగారు మరియు వేదమూర్తులైన బ్రహ్మశ్రీ భళ్లమూడి సత్యవేంకటరమణమూర్తి ఘనపాఠి అల్లుడు గారిచే ఈ గ్రంథము సరిచూడబడి, మా పరమపూజ్య గురుదేవులు వక్తారత్న యజురాధర్వణవేద విద్వాన్, వేదోద్దారక వేదకల్పద్రుమ వేదమూర్తులైన బ్రహ్మశ్రీ వడ్లమాని వేంకటేశ్వరశర్మ అవధాని మహోదయులు వారిచే పరిషృతమై చతుర్థ ముద్రణగా మరల మీ అందరి ఆదరాభిమానములతో సమర్పించడమగుచున్నది.

పాఠకుల సూచన మేరకు ఈ ముద్రణమునందు గ్రంథాక్షరములను పెద్దవిగా చేసి, సాధ్యమైనంతవరకు అక్షరదోషములు లేకుండా ముద్రించడమైనది అయినప్పటికి ఎక్కడైనా పొరపాటు జరిగినచో మలిముద్రణలో పరిష్కరించగలము.

అట్లే మా సంస్కార చిన్తామణిః ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పణ్చుమ గ్రంథములు మరియు శ్రీలక్షవర్తీ కల్పమ్, శ్రీవిద్యోపాసన కల్పద్రుమమ్, సర్వదేవతా ప్రతిష్ఠా కల్పద్రుమమ్, నిత్య లఘు శ్రీచక్రార్చనవిధిః, ఆర్ష వివాహ వైభవమ్, భవిష్య పురాణోక్త సూర్యనమస్కారకల్పః మీ అందరి ఆదరాభిమానాలు పొంది మరల మీ ఆదరాభిమానాల కొరకు తీర్థ శ్రాద్ధకల్పః - శ్రీమహావిద్యా వనదురోపాసన కల్పద్రుమః-సంస్కారచి మణిః షష్ఠభాగః విడుదల గావించుచూ మీకు సమర్పించు చున్నాము. యధాప్రకారముగా ఈ గ్రంథములను కూడా ఆదరించి, మమ్ము కృతార్థులను గావించి మాచే మరికొన్ని గ్రంథములను సంకలనము చేయుటకు ప్రేరణ చేయమని ఇందుమూలముగా కోరుచున్నాము.

  • Title :Taittiriya Panchakaraka Panchopanishad
  • Author :Dwibhasyam Subramanya Sastri
  • Publisher :Gollapudi Veeraswamy And Sons
  • ISBN :MANIMN3500
  • Binding :Paerback
  • Published Date :2019 6th edition
  • Number Of Pages :217
  • Language :Telugu
  • Availability :instock