• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Takattulo Raghunath

Takattulo Raghunath By Perisetti Srinivasarao

₹ 300

జనవరిలో ఆ సాయంకాలాన్ని ఎప్పటికీ మరిచిపోలేను!

నిజానికి అది మధ్యాహ్నవేళ! కానీ వాతావరణం వల్ల అది సాయంత్రంలా అనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం వరకు ఎండగా ఉంది. అతను అప్పుడే భోజనం చేసి తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. అంతలోనే చీకటి కమ్ముకుంది. ఇంట్లో తెరిచి వున్న కిటికీలు, తలుపులు బడబడా శబ్దాలు చేస్తూ వాటికవే తెరుచుకుంటూ మూసుకుంటున్నాయి. తలుపు గడియ విరిగి ఎక్కడో పడిపోయింది. గొళ్ళెం ఎటో పోయింది. నేల కంపించేంతగా ఒకటే శబ్దం. గోడలు కదులుతున్నట్లుగా అనిపించింది. ఆకాశమంతా నల్లబడింది. నలుదిక్కులా కారుమబ్బులు కమ్ముకుని ఉండటం వల్ల చుట్టూ చిమ్మ చీకటి.

అతను లేచి నిలబడ్డాడు!

లాన్ అంతా పెద్దపెద్ద వడగళ్లు, మంచుగడ్డలతో నిండిపోయింది. వసారా రైలింగ్ విరిగి ధడేల్మనే శబ్దంతో ఎక్కడో పడిపోయింది. అంతలో కుండపోతగా వర్షం. వర్షపు చినుకులు ధారాపాతంగా పడుతూ నీటి తాళ్ళేమో అని భ్రమ కలిగిస్తున్నాయి.

ఎడతెరిపి లేకుండా మేఘాలు ఘర్జిస్తూనే ఉన్నాయి. మెరుపులూ మెరుస్తున్నాయి. ఎక్కడో దూరంగా అన్నట్లు కాదు. మన తలపైనే పడుతున్నట్లుగా అనిపిస్తోంది.

డెబ్భై ఒక్క సంవత్సరాల వృద్ధుడైన రఘునాథ్ భృకుటి ముడి పడింది.

అకస్మాత్తుగా ఏమైంది? ఏమి జరుగుతున్నది? అతను ఆశ్చర్యపోయాడు! ముఖంపై నుండి మంకీ క్యాప్ తీసేసాడు. ఒంటిపైన వస్త్రాన్ని ప్రక్కకి తొలగించి కిటికీ దగ్గరకెళ్లి నిలబడ్డాడు! కిటికీ రెక్కలు కొక్కెం సహాయంతో తెరిచి అతను బయటకు తొంగి చూస్తున్నాడు......................

  • Title :Takattulo Raghunath
  • Author :Perisetti Srinivasarao
  • Publisher :Sahitya Acadamy
  • ISBN :MANIMN4700
  • Binding :Papar Back
  • Published Date :2023 first print
  • Number Of Pages :176
  • Language :Telugu
  • Availability :instock