దేశానికి నెత్తుటి స్వాతంత్ర్యం లభించి చాలా రోజులు, నెలలు గడిచాయి. దాంతోపాటు విభజనకు సంబంధించిన పచ్చి గాయాలు కూడా అయ్యాయి. స్వాతంత్య్రపు ఉత్సాహం ఆ గాయాలను ఒకింత ఎక్కువ అనిపించేటంత నెత్తుటిమయం చేసినప్పటికీ, మరోవైపు 'మనం పరతంత్ర్యం నుండి విముక్తుల మయ్యాం, మన దేశం మనకు తిరిగి దక్కింది. ఇప్పుడు కష్టపడే చేతులకు పని దొరుకుతుంది' అనే ఆశ యువజనుల మనస్సుల్లో మొలకెత్తింది.
అలాంటి చాలామంది యువకుల్లో సరవణ కచరూ ఒకడు.
అతను ఓ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. అయితే అతనికి ఈ పని కూడా తాత్కాలికమే. షాపులోని ఓ ఉద్యోగికి ఆరోగ్యం బాలేకపోవటంతో రెండురోజుల్లో వస్తానని చెప్పి వెళ్లినవాడు చాలా కాలంగా జబ్బు పడ్డాడు. అతను కోలుకున్న తర్వాత తిరిగి పన్లోకి వస్తాడు. అందుకని సరవణ వేరే ఉద్యోగం కోసం వెతుకుతూ వున్నాడు. అలాంటి సమయంలో ఒక స్నేహితుడి మేనమామ వల్ల అతనికి జైలులో ఉద్యోగం దొరికింది.
సరవణ జైలులో వార్డెన్గా చేరాడు. అయితే వార్డెన్గా ఉద్యోగంలో చేరినప్పటికీ, ఓ రోజు అతడికి అసహజమనిపించే ఒక ఆహ్వానం వచ్చింది. ఆ రోజున సరవణ జీవితమే మారిపోయింది. కంటికి ఏమీ కనిపించనప్పటికీ, లోలోపల నుండి అతనిని నలిపేసిన లోతైన గాయమది. దాన్ని అనుభవించడానికే సరవణ ఎన్నో మలుపులు దాటి ఆ రోజు జైలులో మరణదండన విధించేవాడిగా ఉరితాడు లాగటానికి ఉరికంబం ఉన్న ఆ వేదికను ఎక్కవలసి వచ్చింది.
సరవణ! జైలులో కొత్త హ్యాంగ్మన్ అంటే 'తలారి? పాత తలారి గేందెలాల్....................