• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Tallapaka Sankeerthanalu
₹ 120

                తొలి తెలుగు వాగ్గేయకారులైన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు మొదలుగా తాళ్లపాక కవులు శ్రీవేంకటేశ్వర స్వామివారి సేవలో తరించినవారు. ఈ భక్తకవులు అందించిన సాహిత్యం తెలుగు వాజ్మయంలో మకుటాయమానమైనది. తాళ్లపాక కవుల సంకీర్తనలు “శ్రీనివాస సేవాప్రబంధం”గా వివిధ కైంకర్యాలలో, ఉత్సవాలలో గానం చేయబడుతున్నాయి. ఆబాలగోపాలం ఈ సంకీర్తనా మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు! తెలుగువారికి తరగని సాహిత్య సంపదను అందించిన అన్నమయ్య కుటుంబీకులకు తెలుగుజాతి ఎంతగానో ఋణపడియున్నది.

                     రాగిరేకులలోని తాళ్లపాక కవుల సాహిత్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు వివిధ దశలలో 1949-1999 సం.ల మధ్య కాలంలో ప్రకటించింది. తాళ్లపాకవారి రచనలు రాగిరేకులలో మాత్రమే కాక, తాళపత్రాలు, కాగితపు ప్రతులలో కూడా లభ్యమైనాయి. సంగీత సాహిత్యపు చవి కలిగిన వీరి సంకీర్తనలు వందల ఏళ్ల క్రితమే దక్షిణ భారతదేశమంతా విస్తరించాయి.