• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Tamilanata Telugunudi Palle Kathalu

Tamilanata Telugunudi Palle Kathalu By Dr Sagili Sudharani

₹ 99

పెళ్ళి సంబంధం

ఒక ఆయన తన కూతురికి పెండ్లికొడుకును చూసేందుకు దక్షిణం దిక్కుగా నడిసి పోతా ఉండె. ఇంకొకాయన తనకొడుక్కి పెండ్లికూతుర్ని చూసేందుకు ఉత్తరం దిక్కుగా ఎదురుగా వస్తా ఉండె. ఇద్దరు ఒకఊరిలో సందించేరు.

పెండ్లికొడుకు అబ్బ మీరు యాడికిపోయేరు? అని పెండ్లికూతురు అబ్బను అడిగేను. దానికి ఆయన నాను పెండ్లికొడుకును తేడేందుకు (వెతికేందుకు) పోయేను. మీరు యాడికి పోయేరు? అని పెండ్లికొడుకు అబ్బను అడిగేను. నాను పెండ్లికూతుర్ని తేడేందుకు పోయేను. ఇద్దరిది ఒకేజాతి (కులం) అని తెలుసుకొన్నాక వీళ్ళకు సంతోషం అయిపాయ. 'సరే' అని ఒక మాను కింద కూలపడిరి.

ఆ కాలాన సత్తమావు (సజ్జపిండి)లో నంజుకోడానికి వెల్లం (బెల్లం) ఒకమూటగా కట్టి ప్రయాణాల్లో తినేవారు. మీరు పొట్లం కొండొస్తిరా? అని ఒకరినొకరు అడుకొన్నారు. పెండ్లి కుంతురబ్బ ఏం చేస్తాడంటే, పెండ్లికొడుకు అబ్బ ఎట్లా తింటాడని చూస్తా ఉండె. అప్పుడు వీడేమి చేసెనంటే మావుమూట నీళ్ళల్లోవేసి, పిండగానే పాలు మాదిరి అవుకదా! అది తాగినాడంట. అప్పుడు పెండ్లికూంతురు అబ్బ ఇట్లాసెలవు (ఖర్చు) చేస్తే నిండా కష్టపడేము. నాను ఎట్టాచేసేనో సూడని చెప్పి, ఆయబ్బేమి చేసినాడంటే, మూటను నీళ్ళపై ఉంచి ఆనీటి నీడలో వుండిన నీళ్ళను తాగినాడు. వీడు నన్ను మించినోడని, లోగా తలచి మీ కుటుంబంతోనే సంబంధం చేసుకుంటానబ్బా! అని పెండ్లికొడుకు అబ్బ అనె, పెండ్లికూతురు అబ్బ 'సరే' అనె. ఇద్దరూ నిండా సంతోషపడి.....................

  • Title :Tamilanata Telugunudi Palle Kathalu
  • Author :Dr Sagili Sudharani
  • Publisher :Arts And Letters
  • ISBN :MANIMN6431
  • Binding :Papar Back
  • Published Date :Aug, 2017
  • Number Of Pages :86
  • Language :Telugu
  • Availability :instock