• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Tamilnaduloni Navagraha Kshetralu

Tamilnaduloni Navagraha Kshetralu By Kumari R Jayasri Kasikar

₹ 50

తిరుమంగళకుడి - సూర్య భగవానుడు

నవగ్రహాలు మానవ జీవితంపై విశేషమైన ప్రభావం చూపుతాయి. గగన మండలం నుండి భూమండలంపై భ్రమణ చేసే ఈ నవగ్రహాలను దర్శించే సదుద్దేశ్యంతో నేను తమిళనాడులో నున్న నవగ్రహ క్షేత్రాలకు ఎంతో ఉత్సాహంతో పయనమయ్యాను.

వర్ష ఋతువులో తమిళనాడులోని తంజావూరు జిల్లా పర్యటన ఎంతో విశేషమైనది. చల్లనిగాలి, పచ్చని పంటపొలాలు, కప్పల బెకబెకలు, పక్షుల కిలకిలనాదాలు, చెట్ల కొమ్మల మధ్య నుండి వీచే గాలుల ధ్వనులు, గలగల నాదంతో ప్రవహించే నదులు - అహా!! ' కల్కి' (సుప్రసిద్ధ తమిళ సాహిత్యకారులు) గారి తంజావూరు జిల్లా యొక్క వర్ణన నా స్మృతి పథమందు మెదిలింది. ప్రకృతి మాత సౌందర్యమును తిలకించటం సహితం దైవ దర్శనంతో సమానమే కదా!

తంజావూరు జిల్లాలోని కుంభకోణం పట్టణమునకు పన్నెండు కిలోమీటర్ల దూరములో నున్న తిరుమంగళకుడి క్షేత్రమందు విరాజిల్లిన సూర్యభగవానుని మందిరానికి వెళ్ళే మార్గంలోనే పైన వర్ణించిన ప్రకృతి సౌందర్యం కనులవిందు కలిగించింది. అక్కడి ప్రకృతి, హరిత (రంజితమై) వర్ణమై కనిపించింది. నిండుకుండవలె నున్న చెరువులలో................

  • Title :Tamilnaduloni Navagraha Kshetralu
  • Author :Kumari R Jayasri Kasikar
  • Publisher :Kumari R Jayasri Kasikar
  • ISBN :MANIMN4201
  • Binding :Papar back
  • Published Date :Dec, 2021
  • Number Of Pages :52
  • Language :Telugu
  • Availability :outofstock