• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Tanikella Bharani Naatikalu

Tanikella Bharani Naatikalu By Tanikella Bharani

₹ 200

ఆ"భరణీ”యం

- డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు

ఎం.ఎ., పి.హెచ్.డి., డి.లిట్.

98483 51517

భరణి... కసి.. కృషి ఉన్న కవి ఋషి. రసగంగా వాహినిలో ఎగిసిన సౌందర్యలహరి. ఆనందానంద అమృతవర్షంలో తడిసిన తన్మయి. కొండొకచో అస్తవ్యస్త వర్తమాన చిత్ర పటాన్ని కసిగా గీకిన విహారి. భరణి బుర్ర ఒక నవరత్నఖచిత బరిణ. అందులో మగువ కనుదోయికి సొగసులద్దే సోయగం, భవిష్యత్తును కళ్ళకు కట్టే భావజాలం లాంటి అంజనం ఉంది. అందులో కాశ్మీర కుంకుమ ఉంటుంది. దానిని కళామతల్లి నుదిటిన సభక్తిపూర్వకంగా తిలకం దిద్దే సహృదయత ఉంది. భరణి అంటే ఒక ఉక్రోషం.. ఒక ఆక్రోశం.. ఒక రవ్వ.. ఒక దివ్వె.. ఒక స్పందన.. ఒక చైతన్యం.. ఒక ఆర్తి.. ఒక దీప్తి.. ఒక కీర్తి.. ఒక స్ఫూర్తి.. ఒక తపస్సు.. ఒక ఉషస్సు.. ఒక ఖడ్గ ప్రహారం.. ఒక వెన్నెల విహారం. నాటిక వ్రాసినా అది నటనాలయ కుడ్యంపై పెట్టిన అందమైన సంతకమే. “కీ”, “సిరా”, “లాస్ట్ ఫార్మర్”, “బ్లూక్రాస్”, “మిథునా”లను తీసిన అన్నింటా ఆర్ద్రత చిలికే భావోద్వేగమే. భరణి తన లేఖినిని కవోష్ణ రుధిర జ్వాలల్లో ముంచి వ్రాస్తాడు. అందుకే వళ్లును చీరే చురకలుంటాయి. దిమ్మెత్తిపోయే సమ్మెట పోటులుంటాయి. ఈ "భరణీయం” కళామతల్లి మెడలో భాసించే పచ్చలపతకం లాంటి "ఆభరణీయం”.

గేయంలో గుండెకు తగిలే గాయాలుంటే అది గొప్పగా పేలుతుంది. కథలో మంచి శైలి.. చెంపపై ఛెళ్లున చరిచే కొసమెరుపు ఉంటేమరీ పండుతుంది. మరి నాటక రచయితకు కావలసింది.. చేయాల్సిందీ ఏమిటి. జీవితం మీద అథారిటీ ఉండాలి. చుట్టూ జరిగే దాన్ని నిశితంగా చూసే కన్నుండాలి. స్పందించే మనసుండాలి. ఆ ఇతివృత్తాన్ని రంగస్థల శిల్పంలో ఒదిగింప చేసే నేర్పు ఉండాలి. సన్నివేశాల దొంతర్లను పేర్చే ఒడుపు ఉండాలి. చిటికెడు కన్నీళ్లు చారెడు నవ్వుల్ని కలగలిపే రసన, రచనా శక్తి ఉండాలి. మల్లెపువ్వులు గుబాళింపుల్ని, మరఫిరంగుల విస్ఫోటనాలను సంభాషణల్లో బాగా కూరాలి.. అక్కడక్కడా విచ్చు కత్తుల్లాంటి విసుర్లను వదలాలి. నిర్లిప్త, నిస్తబ్ద, నిస్తేజాలతో మొద్దుబారిన...................

  • Title :Tanikella Bharani Naatikalu
  • Author :Tanikella Bharani
  • Publisher :Godavari Prachuranalu
  • ISBN :MANIMN6427
  • Binding :Hard Binding
  • Published Date :2025
  • Number Of Pages :158
  • Language :Telugu
  • Availability :instock