రచయిత
1936న గుంటూరులో జన్మించిన డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ 62 సంవత్సరాలుగా హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. 34 సంవత్సరాలు అధ్యాపక వృత్తిలో ఉన్నారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష భావాలు కల్గినవారు. యువజన, అభ్యుదయ పత్రికలకు సంపాదకులుగానూ, మరో పత్రిక వీచిక నిర్వాహకులుగానూ ఉన్నారు. రచనా వ్యాసంగం 1951 నుండే ఆరంభించారు. గేయ కవిత్వం రచనలో కృషి చేశారు. అనేక ఉద్యమాల పాటల సంకలనాలను వెలువరించారు. వీరి సంపాదకత్వంలో వచ్చిన పలు గ్రంథాలు పాఠకుల ప్రశంసలందుకున్నాయి.
విశాలాంధ్ర ప్రచురణాలయం, నవచేతన ప్రచురణ సంస్థలకు సుమారు 40 సంవత్సరాలు సంపాదక బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికీ నవచేతనలో కొనసాగుతున్నారు. 1955వ సంవత్సరం నుండి అభ్యుదయ రచయితల సంఘంలో పని చేస్తున్నారు. అనేక సాహితీ పురస్కారాలందుకున్నారు. కమ్యూనిస్టుపార్టీ సభ్యులు.
వీరికి డాక్టరేట్ పట్టా సంపాదించి పెట్టిన పరిశోధనా గ్రంథం ఇది...................