ఒకమాట - కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ కార్చిచ్చు మాదిరి సంచరించి ప్రభుత్వాలనీ, పోలీసుల్నీ పరుగులు పెట్టించిన షాడోని, ఎంతో ప్రయత్నం మీద పట్టుకోగలిగారు సి.బి.ఐ. చీఫ్ కులకర్ణిగారు. ఒప్పించి తమ సంస్థలో చేర్చుకోగలిగారు. -
ప్రమాదాల్ని ముందుగానే పసికట్టి, అందుకు తగిన విధంగా ప్రవర్తించటం, ఎటువంటి వ్యతిరేకపరిస్థితులు ఎదురైనా కొంచెంగా కూడా బెదరకుండా ఎదురుదెబ్బ తీయటం మొదలైన లక్షణాలు షాడో స్వంతం.
వాటిని ప్రత్యేకంగా పనికట్టుకుని ఎవరూ నేర్పవలసిన అవసరం లేదు. కాని వదిలి పెట్టలేదు కులకర్ణిగారు. ఎన్నెన్నో ట్రెయినింగ్లు ఇప్పించారు. ...
అత్యంత ఆధునికమైన ఆయుధాలను ఉపయోగించటం ఎలాగో తను దగ్గర వుండి మరీ చెప్పించారు. ఫలితంగా అమోఘమైన శక్తియుక్తుల్ని సంతరించుకున్నాడు షాడో. సి.బి.ఐ. అమ్ములపొదిలో వున్న దారుణమైన అస్త్రంమాదిరి తయారైనాడు.