• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Tata Cheppina Kathalu

Tata Cheppina Kathalu By M Krishna Mumari

₹ 175

చలికాలం మొదలు

అది అక్టోబరు నెల. దీపావళి రాబోతోంది. అవ్వ, తాత పండుగ ఏర్పాట్లలో తీరిక లేకుండా ఉన్నారు.

వాళ్ళు ఉత్తర కర్నాటకలోని 'షిగ్గాం' అనే చిన్న పల్లెటూళ్ళో ఉంటారు. వారి పిల్లలిద్దరు కుటుంబాలతో ఒకరు ముంబై, ఒకరు ఢిల్లీలో స్థిరపడ్డారు. ఈమధ్యకాలంలో అవ్వ, తాత ఆ రెండు నగరాలకు మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. వేసవిలో మనవలు శెలవులు గడపడానికి షిగ్గాంకి వస్తారు.

ఈరోజు అవ్వ, తాత ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతమైన మాయావతి వెళ్ళాలని చర్చించుకుంటున్నారు. వాళ్ళకి చాలా ఉత్సాహంగా ఉంది. వచ్చేవారం వాళ్ళ ప్రయాణం అనుకుంటున్నారు.

'మనం హిమాలయాల్లో కొండలమీద అక్టోబరు నెలలో ప్రయాణం చేయబోతున్నాం. అక్కడ మిగిలిన ప్రదేశాలకన్న ముందుగా చలికాలం మొదలయిపోతుంది. అయినా నాకు ఉత్సాహంగా ఉంది. నువు కిందటిసారి హిమాలయాలకు ఎప్పుడు వెళ్ళావో గుర్తుందా?' అన్నాడు తాత నవ్వుతూ.

'బహుశా ఏభైఏళ్ళ క్రితం, ఒక స్నేహితుల ఇంట్లో సిమ్లాలో జరిగిన పెళ్ళికి వెళ్ళాను కానీ హిమాలయాలలో అంత ఎత్తుకు మనం ఎప్పుడూ వెళ్ళలేదు' అంది అవ్వ.

'మన ప్రయాణం గురించి పిల్లలకు చెప్పావా?' అడిగాడు తాత.

'ఆహాఁ! మనం ఈ ఏడాది ముంబై, ఢిల్లీకాక మార్పుకోసం మాయావతి వెళ్ళబోతున్నామని చెప్పాను'.

అప్పుడే ఫోన్ మోగింది. ముంబై నుండి వాళ్ళమ్మాయి ఫోన్ చేసింది..............

  • Title :Tata Cheppina Kathalu
  • Author :M Krishna Mumari
  • Publisher :Alakananda Prachuranalu
  • ISBN :MANIMN5671
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :143
  • Language :Telugu
  • Availability :instock