పరిచయం
మొదటి కథ
ఇదొక విభిన్నమైన కథల పుస్తకం. 150 ఏళ్ళకు పైగా గుర్తింపుపొందిన వ్యవస్థ కలిగిన టాటాల చరిత్రలో వైవిధ్యం కలిగి స్ఫూర్తిని నింపే చాలా కథల సంకలనం.
భారతదేశంలో ప్రధాన కార్యాలయం కలిగిన అనేక సంస్థలతో కూడిన అతిపెద్ద భారతీయ కార్పొరేట్ నెలవు టాటా. ప్రపంచ వ్యాప్తంగా 700 మిలియన్ల వినియోగదారులు టాటా ఉత్పత్తులు, సేవలు ఉపయోగించడానికి కారణం అవి సాధించిన మొక్కవోని నాణ్యత, మన్నికలతోబాటు, పదిహేను దశాబ్దాలకు పైబడి టాటా మాత్రమే పొందిన విశ్వసనీయత.
ఈ సుదీర్ఘవర్తుల కాలరేఖపై కొన్నివేల, అందమైన, అబ్బురపరిచే టాటా కథలు మనల్ని ఉత్తేజపరచి, ప్రేరేపించి మన జీవితాలను సార్థకం చేసుకునేందుకు తోడ్పడతాయి.
ఈ కథలు అసాధారణ, దీర్ఘకాల, దీప్తిమయ వైవిధ్యభరిత జీవితాలను, టాటా విజయాలను ప్రతిఫలిస్తాయి. కానీ వాటి సారాంశం చాలా సాధారణ స్త్రీ, పురుష సమూహాలను కదిలించటం. మనకు అవి ఎన్నో లోతైన పాఠాలను అందిస్తాయి.
దేనికైనా ఒక తొలి కథ ఉంటుంది. అది టాటా సంస్థ ఎలా పుట్టింది అనేది!
జంషెడ్జీ టాటా కథ
ఈ కథ భారతదేశ పశ్చిమ ప్రాంతంలో గుజరాత్ లోని 'నవసారి' నగరంలో చిన్న ఇంటిలో మొదలవుతుంది. 1839 మార్చి 3వ తేదీన ఫార్సీ జొరాస్ట్రియన్ మతాచార్యుల కుటుంబానికి చెందిన 'నుస్సర్ వాంజీ టాటా'కు కుమారుడు జన్మించాడు. ఆ కుర్రవాడే టాటా సంస్థను స్థాపించిన జంషెడ్జీ టాటా. తండ్రితో కలసి ఉండటానికి జంషెడ్జీ తన పదమూడో ఏట ముంబైకి వెళ్ళాడు.
ఎల్ఫిన్స్టోన్ కళాశాలలో చదివిన అతను పుస్తక పఠనం పట్ల మక్కువ పెంచుకున్నాడు. చార్లెస్ డికెన్స్, విలియం మేక్పీస్ థాకరేలు అతని అభిమాన రచయితలు. మార్క్ ట్వైన్ హాస్య రచనలను ఆనందించేవాడు. పుస్తకాలు అతనికి ప్రపంచపు అద్భుతద్వారాలు........................