ఏమండీ, పొట్లూరి వెంకటాచారిగారూ! మా అబ్బాయి అల్లరి మూకతో సావాసం చేసి పాడైపోతున్నాడు.... మారే అవకాశం వుందంటారా?
ఓ చిన్న చెక్కముక్కని తీసుకుని, దానిమీద కళాత్మక ప్రతిభను కనబరిచి ఏనుగు రూపాన్ని మలిచితే, అది 'ఏనుగు బొమ్మ' అంటూ ప్రశంసించబడుతుంది. పిదప దాన్ని' చెక్క ముక్క' అంటూ ఎవ్వరూ చెప్పరు.
మామూలు బంకమట్టే అన్నం ఉడికించేపాత్రగా మారుతోంది! మీ అబ్బాయి ఇప్పుడున్న స్థితి గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోకండి! అతడి చుట్టూవున్న పరిస్థితులు మారినప్పుడు అతడూ మారిపోతాడు.
ఏ దేవుడ్ని మొక్కితే త్వరగా పాపాలు పోతాయి?
గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయని ఎందరో గంగలో స్నానం చేశారు. అందరి పాపాలనూ గంగ స్వీకరించింది.
ఓ రోజు గంగాదేవి శివుడితో, "ప్రపంచంలోవున్న అందరూ నా దగ్గర పాపాలు వదిలేసి వెళ్తున్నారు. నాకు పాప భారం రానాను ఎక్కువవుతోంది. ఈ పాపాలబారి నుండి బయటపడి పుణ్యం సంపాదించుకోగలగటానికి కొత్తగా నాకేదైనా వరమో, శక్తి ఇవ్వండి" అంటూ అడగ్గా............