₹ 40
ఆధ్యాత్మిక విషయమును ఎందరో జీవులు రాలేక ప్రాపంచిక విషయములలో పడి కొట్టుమిట్టాడుచు ఆనందప్రాప్తిని పొందలేక దుఃఖ పూరితమైన జీవితాన్ని గడుపుచు ప్రకృతి బాధలను అనుభవించుచు వేసారక వాటియందే కాలాన్ని గడుపుతూ విలువైన వారి జీవితాలని వృధా చేసుకొనుచున్నారు. అటువంటి వారిని ఉద్దరించటానికై శ్రీ భగవంతుడు మహాత్ముల ద్వారా బోధలు గావించి శాస్త్రముల ద్వారా బోధలు వినిపించి పరమాత్ముని మార్గమున నడుచుటకై మహాత్ముల యొక్క సేవలు నావ వలె ఉపయోగపడుచున్నవి.
భగవంతుడు యోగుల హృదయాలలో కాని భక్తుల దగ్గర కాని ఉండను నారదా! నా యొక్క కీర్తనలు ఎక్కడ ఉంటాయో అక్కడ నేను ఆనందభరితుడనై వుంటానని శ్రీ మహావిష్ణువు నారదుల వారికి చెప్పిన విషయాన్ని మహర్షి నారదులవారు అన్నమయ్య గారికి ఇచ్చిన సందేశము. కావున అందరూ ఆ పరమాత్మ గానా మృతములో స్నానమాచరించి జ్ఞాన రసాన్ని ఆస్వాదించి ఆచరించి అమృతతుల్యులు అగుదురుగాక!
- శ్రీ జగద్గురు రాములు గారు
- Title :Tattwagnana Ganamanjari Bhajanamala
- Author :Jagadguru Ramulu Garu , Sadguru Ramabhramananda Swami
- Publisher :Sri Geetha Gnana Gurubhakta Mandali
- ISBN :GOLLAPU347
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :92
- Language :Telugu
- Availability :outofstock