• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Teerokka Puvvu

Teerokka Puvvu By Tagulla Gopal

₹ 90

అక్షర పుష్పాలు

ఎంత బాగా రాసిండు నానీలు తగుళ్ళ గోపాల్, ఒక్కొక్క నానీ ఒక్కో పువ్వు. అంతే కాదు తీరొక్కపువ్వు, అంటే రకరకాల పువ్వులని. తెలంగాణాలో బతుకమ్మ తీరొక్క పూలతో ఏర్పడుతుంది.

'ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మా

తీరొక్క పువ్వోప్పునే గౌరమ్మా' అంటూ నా చిన్నతనంలో మా అమ్మపాడిన బతుకమ్మ పాట ఇప్పటికీ చెవుల్లో ధ్వనిస్తుంది. ఒక్క పువ్వు కాదు, అనేక పుష్పాలతో తయారయ్యే బతుకమ్మ అందానికే అందం. ఒక సామూహిక చందం. గోపాల్ రాసిన నానీలూ అంతే. జీవితంలోని అనేక పార్శ్వాలనూ, భావ వర్ణాలనూ ప్రతిఫలించిన కవిత్వపరిమళాలను నానీలుగా మలిచిన నవప్రతిభాశాలి గోపాల్.

ఇంత చక్కటి నానీలను వెదజల్లిన ఈ చిరంజీవి వయస్సు 23 సంవత్సరాలే. పాలమూరు జిల్లాలోని మాడ్గుల మండలంలోని కలకొండ గ్రామంలో జన్మించాడు. నానీల దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నేను నానీ సంపుటాలకు రాసిన పీఠికలను డా|| పత్తిపాక మోహన్ గ్రంథరూపంలో తీసుకొచ్చాడు. దానిని చదివి గోపాల్ నానీల పట్ల ఆకర్షితుడై నిర్దుష్టమైన నానీలను వెలయించాడు. అతని తొలి పుస్తకం. నానీల సింహద్వారంగుండా కవిత్వంలో ప్రవేశిస్తున్న ఈ యువ కిశోరానికి మంచి భవిష్యత్తు ఉందనటానికి ఏమాత్రం సందేహించను. ఈ నానీలు చదివితే మీరూ నాతో ఏకీభవిస్తారు. ఇంకా పెళ్ళికాలేదు. చెల్లెలి పెళ్ళి బాధ్యత తీరిన తర్వాత చేసుకుంటానన్నాడు, ఫోన్లో. చెల్లెలి గురించిన నానీలు కూడా దీనిలో ఉన్నాయి. తర్వాత వాళ్ల నాన్న..........................

  • Title :Teerokka Puvvu
  • Author :Tagulla Gopal
  • Publisher :Telugu Collective
  • ISBN :MANIMN5979
  • Binding :Paerback
  • Published Date :2024
  • Number Of Pages :70
  • Language :Telugu
  • Availability :instock