• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Teetvaal Kukka Mari Konni Kathalu

Teetvaal Kukka Mari Konni Kathalu By Sadat Hasan Manto

₹ 60

సరైన సమయంలో సరైన కథా సంకలనం

అది ప్రపంచ యుద్ధాల యుగం. వలసవాదం తన పరాకాష్టను అందుకున్న సందర్భం.

అమానుషత్వం వివిధానేక రూపాల్లో విశృంఖల స్వైరవిహారం చేస్తూన్న రోజులు. సామ్రాజ్యవాదం తన సర్వశక్తినీ ఒడ్డి బీభత్సాన్ని సృష్టిస్తూన్న సమయం. మానుషత్వం అనేది దాదాపుగా మటుమాయం అయిపోతూన్న దినాలు. ఖచ్చితంగా అదే కాలంలో సాదత్ హసన్ మంటో కళ్ళు తెరిచాడు. ఒక ఉద్దేశ్యం, లక్ష్యసాధన, నైతికత అనేవి నాటి సాహిత్యానికి కొలమానాలుగా ఉండేవి. నిజానికి అవి మహాకవి మౌలానా హాలీ నిర్మించిన కావ్యశాస్త్ర విలువలు. అక్బర్ ఇలాహాబాద్, డాక్టర్ ఇఖ్బాల్ ఈ విలువలకు ఒక గౌరవాన్ని సమకూర్చి పెట్టగా ప్రేమ్చంద్ ఆదర్శవాదం దానిని మరింత పరిపుష్టం చేసింది.

మంటో తన సాహిత్యం ద్వారా సకల మూఢాచారాల్నీ, పాత నైతిక విలువల్నీ ధ్వంసం చేయటం లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆభిజాత్య సంస్కృతిలోని డొల్లతనాన్ని బట్టబయలు చేశాడు. అంతేకాదు, అనాటి సాహిత్య విశ్వాసాలతో తలపడ్డాడు. ఇది చాలా సాహసోపేతమైన చర్య. సాహిత్యం విషయంలో మంటో ఎన్నడూ రాజీమార్గాన్ని అనుసరించలేదు.

మంటో దృష్టిలో ప్రేమ, మమత, దుఖం విడివిడి వాస్తవాలు కావు. అవి ఒకే వాస్తవికతకు సంబంధించిన వివిధ నామాలు. అతని దృష్టిలో దుఖమే మానవతకు అందివచ్చిన భాగ్యం. దుఖమే సాదత్ హసన్ మంటో. ఈ దుఖమే మీరు. ఈ దుబ్జమే సమస్త ప్రపంచం. ఇదీ అతని సిద్ధాంతం. నిజానికి మంటో ఈ దుబ్జం ద్వారానే మానవత్వాన్ని అర్థం చేసుకున్నాడు. అతని సాహిత్యానికి సంబంధించిన ఒక మౌలికమైన వాస్తవం ఇది.

ఈ వ్యవస్థలో, దీని నిర్మాణంలో ఎక్కడో ఒక పెద్ద లోపం వుంది. ఆ లోపం ఏమాత్రం భరింపశక్యం కానిది. ఇదీ అతని అవగాహన. మంటో రాసిన...............................

  • Title :Teetvaal Kukka Mari Konni Kathalu
  • Author :Sadat Hasan Manto
  • Publisher :Viplava Rachayithala Sangham
  • ISBN :MANIMN6325
  • Binding :Papar Back
  • Published Date :Jan, 2025
  • Number Of Pages :109
  • Language :Telugu
  • Availability :instock