తీవ్రంగా కలిచివేసే సంఘటనలు, నమ్మశక్యం కాని అన్యాయానికి సాక్ష్యంగా నిలిచే పరిణామాలు, భరించరాని హింస కూడా ఓరిమి, ప్రేమ, మంచి కోసం ఎదురుచూపులు వ్యక్తపరిచే వింతైన కథలు.
-హర్ష మందెర్
తీవ్రవాదిగా చిత్రణ, భయంకరమైన, హృదయ విదారకమైన పాత ఢిల్లీలో నివసించిన ఒక యువకుడి కథ: తీవ్రవాదిగా చిత్రించబడి, దాదాపు 14 సంవత్సరాలు జైలులో పెట్టబడిన
కష్టతరమైన, సంక్లిష్టమైన చట్టాలతో సుదీర్ఘకాలం పోరాటం చేసి, చిత్రహింసలను, ఒంటరి ఖైదును జయించిన వీరుని గాథ. మొహమ్మద్ అమీర్ ఖాన్ తాను పెరిగిన ప్రజాతంత్ర విలువలకి లౌకికతత్వానికి కట్టుబడి ఉన్న వ్యక్తి. ఓటమిని అంగీకరించని వ్యక్తి; తన కుటుంబం గురించి తాను కన్న కలలను సాకారం చేసుకునే వరకు కృషి చేసిన వ్యక్తి; తనను దాదాపు సర్వనాశనం చేసిన దేశాన్ని వీడని వ్యక్తి.
ఇదోమానవత్వానికి పరాకాష్టగా నిలిచే కథ; తీవ్రమైన అన్యాయాన్ని కూడా పట్టుదలతో ధైర్యంతో ఎదిరించి నిలిచిన వ్యక్తి కథ. ఇది కేవలం ఒక జ్ఞాపకాల సమాహారం కాదు; ప్రతి భారతీయుడు తప్పనిసరిగా వెంటనే చదవవలసిన కథ; ప్రతి భారతీయుని చేతిలో ఉండవలసిన
అమీర్ విడుదల, ఇంకా ఎంతో మంది తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొని విముక్తి పొందడం మన న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పునర్ స్థాపితం చేస్తుంది. కానీ ఎంత మంది అమాయకులకు ఇంతటి అదృష్టం దక్కుతుంది. నిర్దోషిగా రుజువయ్యేంతవరకు దోషిగా భావించడం, శిక్షాస్మృతిలోని న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఇది తప్పనిసరిగా అంతమవ్వాలి. అవిశ్రాంతంగా మానవ హక్కుల కోసం కృషిచేసే నందితా హక్సర కన్నాగా అమీర్ కథను చెప్పేవారు ఇంకెవరుంటారు.
- ఫైజాన్ ముస్తఫా,
- వైస్ ఛాన్సలర్, నేషనల్ అకాడెమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్