రూపరేఖ
స్మృతి, విస్మృతి. ఈ రెండూ మానవునిలోని మహత్తర శక్తులు, జ్ఞాపకం * చేసుకోటం ఎంత గొప్ప శక్తియో, మరచిపోవటం అంతకంటే తక్కువ గొప్ప శక్తి - కాదు. రెండూ కూడా వ్యక్తికి సుఖాన్ని కలిగించగలవు, దుఃఖాన్ని కలిగించగలవు. ప్రియమైన వాటిని జ్ఞాపకం చేసుకోటం సుఖం కలిగిస్తే, అప్రియమైన వాటిని జ్ఞాపకం చేసుకోటం దుఃఖం కలిగిస్తుంది. అప్రియమైన వాటిని మరచిపోవటం సుఖం కలిగిస్తే, ప్రియమైన వాటిని మరచిపోవటం దుఃఖం కలిగిస్తుంది. స్మృతి, విస్మృతీ రెండూ ఒకేసారి మేల్కొని వుండవు; రెండూ ఒకేసారి నిద్రాణమై వుండవు. స్మృతి మేల్కొని వుంటే విస్మృతి నిద్రాణమై వుంటుంది. అది నిద్రాణమై వుంటే, ఇది మేల్కొని వుంటుంది.
నా “తెగిన జ్ఞాపకాలు'లో స్మృతి మాత్రమే వుంటే, అవి తెగిన జ్ఞాపకాలు కాక తెగని జ్ఞాపకాలే అయ్యేవి. స్మృతి ధారను అక్కడక్కడ విస్మృతి తెంచింది. కనుక అవి తెగిన జ్ఞాపకాలు అయినవి. నా జ్ఞాపకాలు ప్రియమైన వాటిని మాత్రమే గుర్తు చేసుకుని సుఖాన్ని ఇచ్చేవి కాక అప్రియమైన వాటిని కూడ గుర్తు చేసుకుని దుఃఖాన్ని కూడ ఇచ్చేవి అయివున్నవి. జీవితంలో అచ్చంగా సుఖాలు మాత్రమే వుండవు. అచ్చగా దుఃఖాలు మాత్రమే వుండవుగా. సుఖదుఃఖాల వెలుగునీడల క్రీడయే జీవితం. ఒకరి జీవితంలో వెలుగు భాగం ఎక్కువ వుంటే మరొకరి జీవితంలో నీడ భాగం ఎక్కువ వుంటుంది. ఒకరి జీవితంలోనే కొన్ని సమయాల్లో వెలుగు భాగం ఎక్కువ ఉంటే మరికొన్ని సమయాల్లో నీడ భాగం ఎక్కువుంటుంది. అయితే మానవాదర్శం మాత్రం తన సృజనాత్మక సాధన ద్వారా తన జీవితంలోని వెలుగు భాగాన్ని ఎక్కువ చేసుకోటం, నీడ భాగాన్ని తక్కువ చేసుకోటం అయివుంది. క్రమేణ వెలుగులోని తీవ్రత ఎక్కువయ్యే వరకు నీడల అస్తిత్వమే నశించిపోవచ్చు!
మరపు అనేది మరపుగా తడితే ప్రమాదం లేదు కాని మరపు అనేది జ్ఞాపకంగా భ్రమ కలిగిస్తే మాత్రం ప్రమాదం. మనో విజ్ఞానంలో రెండు పదాలు ఉన్నవి, అమ్నీషియా (Amnesia), పేరామ్నీషియా (Paramnesia) అని. ఈ రెండూ కూడ.......................