• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Telagana Navala Rachayitrulu Oka Parisheelana

Telagana Navala Rachayitrulu Oka Parisheelana By Dr Syed Afrin Begum

₹ 250

అధ్యాయం - 1
 

1.1. తెలంగాణ నవలా రచయిత్రుల పరిచయం

1.1.1. ఉపోద్ఘాతం

తెలంగాణ ప్రాంతం అనేక ఉద్యమాలకు నెలవు. నేటికీ నిరంతరం పోరాటాన్ని సాగిస్తున్న ప్రాంతం తెలంగాణ. ఉద్యమాలకు ఊపిరినిచ్చిన అనేక సాహిత్య పక్రియలు తెలంగాణలో ప్రారంభమైనాయి. సాహితీ ప్రక్రియల్లో బహుళ పాఠకాదరణ పొందిన ప్రక్రియ నవల. ఇక్కడ వెలువడిన నవలల్లోని సామాజిక వాస్తవికత, మానవ సంబంధాలు, సంప్రదాయ సాంస్కృతిక విలువలకు ఉన్న ప్రాధాన్యం మరే ఇతర ప్రాంతం నుండి వచ్చిన నవలలకు లేదు. తెలంగాణ నవలా సాహిత్యానికి వన్నె తెచ్చి, విలువ సమకూర్చిన రచయితలు, రచయిత్రులు ఎందరో ఉన్నారు. తెలంగాణ నవలా ప్రాముఖ్యాన్ని, లక్షణాలను, సమపాళ్లలో మేళవించిన నవలలు తెలంగాణ మట్టి వాసనలతో గుబాళిస్తున్నాయి.

"జాతి జీవన విధానమే సంస్కృతి. జాతి ప్రత్యేకత ఆస్తిత్వాన్ని నిలబెట్టేదే సంస్కృతి. అయితే తెలంగాణ చరిత్ర, సాహిత్యం, సంస్కృతి వివిధ పాలకుల కాలంలో ఉద్దేశ్యపూర్వకంగానో, వివక్ష కారణంగానో చాలా కాలంగా నిరాదరణకు, ఉపేక్షకు గురై అసలు తెలంగాణకు చరిత్ర, సాహిత్యం, సంస్కృతే లేదనే స్థితికి చేరుకున్నాం. భౌగోళికంగా, చారిత్రకంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, సాహిత్యపరంగా ఒక ప్రత్యేకతను కలిగిన ప్రాంతం తెలంగాణ.” 1 ." ' (తూర్పు మల్లారెడ్డి.............

  • Title :Telagana Navala Rachayitrulu Oka Parisheelana
  • Author :Dr Syed Afrin Begum
  • Publisher :Afrin Publications
  • ISBN :MANIMN5155
  • Binding :Papar back
  • Published Date :April, 2022
  • Number Of Pages :299
  • Language :Telugu
  • Availability :instock